నాయకన్ గూడెంలో అక్రమణ హాడాహుడి
◆◆ ఎన్ఎస్పీ స్థలంలో 100మందికిపైగా గుడిసెల నిర్మాణం
◆◆ పట్టాభూమిలో వేశారని పిర్యాదు చేసిన గిరిజన రైతు
◆◆ జాతరగా మారిన ఎన్ ఎస్ పీ కాలువ ప్రదేశం
కూసుమంచి, జూన్ 27(విజయం న్యూస్)
కూసుమంచి మండలం నాయకన్ గూడెం లోని సాగర్ ఎడమ కాల్వ పక్కన నిరుపేదలు భూ అక్రమణలో బిజీబిజీగా మారారు. ఎన్ఎస్పీ భూమి అని భావించిన పేదలు అక్రమించుకుని గుడెసులు వేస్తున్నారు. రాత్రికి రాత్రి వంద మందికి పైగా వెళ్లి గుడిసెలు వేశారు. దీంతో సాగర్ కాల్వ ప్రదేశం జాతరగా మారింది. ఎవరికీ వారు హద్దులు పాతి ఆక్రమింంచుకున్నారు. అయితే పేదలు అక్రమించిన స్థలం నాదేనంటూ కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాకు చెందిన బీజేపీ నాయకుడు హట్యనాయక్ వాపోతున్నారు.తనకు 5.5ఎకరాలకు పట్టా ఉందని కావాలనే కొందరు అధికారపార్టీకి చెందిన నాయకులు పేదలను రెచ్చగొట్టి నా పట్టా భూమిని అక్రమించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కూసుమంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Allso read:- కాంగ్రెస్ గూటికి రామూర్తినాయక్ దంపతులు