Telugu News

“ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రశ్నించే మేధావులు ఎక్కడ”

వామపక్షభావజాలం రోడ్డేక్కేదెప్పుడు"

0

“ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రశ్నించే మేధావులు ఎక్కడ”

== వామపక్షభావజాలం రోడ్డేక్కేదెప్పుడు”
–——————–
లోడిగ వెంకన్నయాదవ్-సామాజిక వెత్త
–——————-
రాతియుగంనుండి రాకెట్ యుగంలో పయనిస్తున్నా ,రోల్ రోకలి మందు నుండి అణుభాంబులు తయారు చేసే యుగంలో అడుగుపెట్టినా ,కంప్యూటర్ యుగంలో వేగవంతమైన జీవితం లో ఒక ప్రక్క పయనిస్తున్నా ప్రజాస్వామ్యం బీటలువారి ఆటవిక రాజ్యం తలపిస్తున్న జీవన విధానం తో బ్రతుకుతున్నాము. నేటి రాజకీయ క్రీడ పది తరాలు వెనక్కి నెట్టబడి మనుషులను జీవన ప్రమాణాలు ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

allso read- నాయకన్ గూడెంలో 8 గొర్రెలు మృతి,,

ప్రజాస్వామ్యం లో సగటు మనిషి బ్రతుకు నీతి విలువలను మరిచేలా ప్రభుత్వాలు , పాలకులు పునాదులు వేస్తున్నారు.
ఇటీవల జరుగుతున్న ఎన్నికలు చూస్తుంటె ప్రజాస్వామ్య బద్దంగా జరగటానికి ప్రతిపక్షం ,అధికార పక్షం అన్న తేడా లేకుండా ప్రజలను గందరగోళం లోకి నెట్టివేసేలా ప్రవర్తిస్తున్న తీరు రోతపుట్టిస్తున్నొయి. మనం బ్రతుకుతున్నది మనుషుల మద్యనేనా అన్న అనుమానం కలుగుతోంది.
సామాన్య ప్రజల కనీస అవసరమైన విద్య ,వైద్యం అందుబాటులో లేకుండా చేశారు సామాన్యుణి రెండింటి కి దూరంపెట్టారు. ఉద్యోగంలేక నిరుద్యోగఉపాదికి భద్రత లేకుండా సరియైన జీవన ప్రమాణాలు పెంపొందించకుండా అనారోగ్య జీవనాన్ని సగటు మనిషి దుర్భల పరిస్థితులకు ప్రభుత్వాలు పాలకులు కారణమౌతున్నారు. రాజకీయ పదవులు ప్రామాణిక కారణాలు లేకుండా వారి వారి కుటుంబాలకు భద్రతతో బలపడుతున్నాయి కాని సగటు మని బతుకు దెరువుకు బద్రత లేకుండా పోతోంది.
ఆకర్షణీయమైన పథకాల తో ప్రజలను చేతగాని దద్దమ్మలుగా మారుస్తూ ఎన్నికల పేరుతో ప్రజలను ఓటు అమ్ముకొనే బిచ్ఛగాళ్ళుగా పాలకులు ఆటలాడుకొంటున్నారు. ఓటు విలువ తెలియనీయకుండా ఓటంటే డబ్బుగా మార్చేస్తున్నారు. ఓటును అంగడిలో సరుకు చేసి రాజకీయ పాలకులు తమాశ చేస్తున్నారు. ఒక్క ఓటుకు అధికార ప్రతిపక్షము కలిపి 10,000/-రూ విలువ ను పెంచి ఓటును నోటుతో విన్యాసాలు చేస్తూ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారు.

allso read-  బిలీఫ్ ఆసుపత్రి పై ఐటీ దాడులేందుకు..?
ప్రజాస్వామ్యన్ని , ప్రజావిలవను మెరుగు పరిచే ఆలోచన ఉన్న వ్యక్తులు ,విద్యవంతులు ప్రజాస్వామ్య విలువల కొరకు పాటుపడే మేధావులు ఎన్నికల బరిలో నిలిచినా ప్రజలు బలి పశువును చేస్తున్నారు. ఆకోవలోనే విద్యావంతులైన మేధావులు జయప్రకాష్ నారాయణ ,విలువలను కాపాడే తాపన ఉన్న జేడి లక్ష్మీనారాయణ, విద్యార్థులు నిరుద్యోగులుగా మారకుండా సమాజం గురించి ఆలోచించె ఫ్రోఫేసర్ కోదండరాం గార్లు మరికొంతమంది ఎన్నికల వేలంపాటలో నిలువకలేక పోయారు.
దీనికి కారణం ఎ‌వరు..? ప్రజల్లో చైతన్యం లేకనా ..? ఓటును ప్రజలను బానిసలుగా చేసి మత్తులో ప్రజాస్వామ్య తో ఆటలాడుకోవడమా..? ఎన్నికలు అంటేవిలువలను తుంగలో తొక్కి తాయిలాలపేరుతో డబ్బు అనే మత్తులో ప్రజలను పాలకులు వీధినాటకం లా తలపిస్తోంది.చివరకు ప్రజలు కూడ నా ఓటు కు డబ్బు అందలేదు అనే స్తాయికి దిగజారి వీధిన పడుతున్నారు. ప్రజాస్వామ్య మనుగడలో ఇది భౌషత్ తరానికి శ్రేయస్కరమా ఆలోచన చేయాలి.
ఈ సమాజాన్ని ఎటు తీసుకుని పోతున్నాము మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఆలోచించాలి. కోట్లు కుమ్మరిస్తేనే ఓట్లు అన్నవాతవరణం ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు రాజ్యమేలుతున్నారు.
తెలంగాణ వచ్ఛిన దెగ్గరినుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు అద్యయనం చేయాలిసిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్ఛినప్పడు మాకేంది-మీకేంది అనే తీరులో ప్రజలను తయారు చేసి ఒక్క నియోజకవర్గ ఎన్నిక కనీసం 100 కోట్లు ఉంటేనే బరిలో నిలిచే స్తాయికి తీసుకెళ్ళారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ కి 100 కోట్ల బడాబాబుల ను అక్కన చేర్చుకొని ఓటును అంగడి సరుకులా తయ్యారు చేసిన తీరు ప్రజాస్వామ్యము సిగ్గు తో తలదించుకొనేలా రాజకీయ పాలకులు తయారు చేశారు. ఒకవేళ్ళ ఈ ఎన్నికల క్రీడలో ఓడినా గెలిచిన ప్రతినిధి ని తమవైపు సంతలో పశువును కొన్నట్టు కొంటున్నారు.
ఈ పరిణామాలు రానున్న తరానికి పంచిఇచ్ఛే సంపద ఇదేనా.? ప్రజాస్వామ్య వాదులు మేధావులు ఆలోచన చేయాలిన అవసరం ఆసన్నమైంది.

allso read- మంత్రి గంగుల కమలాకర్ కు షాక్
ముఖ్యంగా ప్రజాస్వామ్యన్ని కాపాడటానికి , ప్రజలసమస్యలపరిష్కారానికి ప్రజలను చైతన్య పరిచి కార్మిక జీవన విధానం లో ప్రజల జీవన పరిణామాలను మెరుగు పరిచే ప్రజాస్వామ్య పరిరక్షణ భాద్యత మొదటి నుండి వామపక్ష పార్టీ లు ముందుండి ఎదురొడ్డి పారాడిన మాట యదార్థం.
కాని సిద్దాంతాలను పక్కన పెట్టి మతతత్వ పార్టీ లను వెతిరేకత పేరుతో బూర్జువా పార్టీ లతో కలిసి పనిచేయటం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. గెలుపు ఓటములను శాసించే వామపక్షాలు ఓటున అంగడి సరుకులా కొంటుంటే నివారించే వారే ఓటును కొనేవారి పక్కన చేరటం ప్రజలకు రుచించడంలేదు.ఎందుకంటే పుచ్ఛలపల్లి సుందరయ్య ఆదర్శ భావాలు కలిగిన వామపక్షాలకు ఎప్పటి ప్రజలలో విలువ ఆదరణ ఉంది. కాని ఓటును అంగడి సరుకులా కొంటుంటే తిరగబడాలిసిన వామపక్షాలుఊరకుంటే ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. పాలక పక్షాన్ని చీల్చి చెండాడి ప్రజలపక్షాన నిలబడవలిసిన కమ్యూనిస్టు లు ఓటుకు 5000/-రూ ఇచ్ఛే వారి సరసలన నిలుబడితే ఈ ప్రజాస్వామ్యన్ని కాపాడేది ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. ప్రజాసమస్యలపై ప్రభుత్వ ప్రజావెతిరేక పాలనకు ఎదురొడ్డి నిలబడే దమ్ము ఒక్క కమ్యూనిస్టు లకు మాత్రమే ఉందన్నది నిజం.

allso read- ఖమ్మంలో ఐడీ దాడులు
అవినీతికి పాల్పడిన, ప్రజాసొమ్ము దుర్వినియోగం జరిగిన ,ప్రజలను బిచ్ఛగాళ్ళుగా చేసి ఓటును నోటుతో ప్రలోభ పెట్టినా ఇప్పుడు అడ్డుకొనే వారు ఎవరు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ,పిడి యాక్టులతో గొంతు నొక్కి భయబ్రాంతులకు గురిచేస్తే ఇది ప్రజాస్వామ్యమునకు శ్రేయస్కరమా అని ప్రజలలో ఆలోచన మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మేధావులు నోరువిప్పి ,వామపక్షాలు రోడ్డున ఎక్కినిలదీయాలని ,వామపక్ష బావజాలం వినిపించాలని ప్రజలు కోరుకొంటున్నారు. కేసులు,కోర్టులు ఎదిరించి నిలబడే సత్తా ఒక్కకమ్యూనిస్టు లకే ఉంది అని ప్రజలు కూడ విశ్వస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కు ప్రజలు ఓటును స్వేచ్ఛ గా పాల్గొనేలా ,ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజమైన ప్రజాతీర్పు కొరకు ప్రజలను చైతన్య పరిచిచి మరో పోరాటం చేయాలి అని మేదావులను వామపక్షాలను ప్రజలు కోరుకొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వాదులు , మేదావులు ,వామపక్షాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యన్ని కాపాడతారని ఆశిద్దాం.

లోడిగ. వెంకన్నయాదవ్
సామాజిక వెత్త-ఖమ్మం