Telugu News

బొమ్మ తుపాకితో హల్ చల్

ఇద్దరు యువకులు కేసు నమోదు

0
బొమ్మ తుపాకితో హల్ చల్
== ఇద్దరు యువకులపై కేసు నమోదు
(ఖమ్మం-విజయం న్యూస్)
బొమ్మ తుపాకీతో హల్ చల్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీ టౌన్ సిఐ సర్వయ్య తెలిపారు. గత రాత్రి నగరంలో ఇద్దరు యువకులు మయూరి సెంటర్  నుండి జూబ్లీక్లబ్ బ్రిడ్జ్ పై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ…. బొమ్మ తుపాకీతో హల్ చల్ చేస్తున్నట్లు స్ధానికుల అందించిన సమాచారం తో పెట్రోలింగ్ పోలీసులు,బ్లూక్లోడ్స్ సిబ్బంది అదుపులోకి తీసుకునట్లు తెలిపారు. నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన కరెంట్ పనులు చేస్తున్న ఎస్ కె. ఇదాయతుల్లా, మరొకరు ఏసీ మెకానిక్  ఎస్ కె. మౌలానా  ఈ ఇద్దరు సినిమా స్టైల్ లో ఫోటోలకు ఫోజులు పెడుతూ..ఫేస్‌బుక్ , ఇన్ స్టాగ్రామ్, సామాజిక మాధ్యమాల్లో చిత్రాలను పోస్టు  పెట్టడం అలవాటు గా చేసుకున్నారని తెలిపారు. నగరంలో బొమ్మ తుపాకీతో హల్ చల్ చేస్తూ ప్రజలను భయభ్రంతులకు గురిచేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుండి స్కూటి, బోమ్మ తూపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.