Telugu News

బొమ్మలో సినీ హీరో అల్లు శిరీష్ సందడి

కేరింతలతో గోలగోల చేసిన విద్యార్థులు, అభిమానులు

0

బొమ్మలో సినీ హీరో అల్లు శిరీష్ సందడి

== స్వాగతం పలికిన బొమ్మకళాశాల యజమాన్యం

== కేరింతలతో గోలగోల చేసిన విద్యార్థులు, అభిమానులు

ఖమ్మం,నవంబర్1 (విజయంన్యూస్):

అల్లు అర్జున్ సోదరుడు సినిహీరో అల్లు శిరీష్  ఖమ్మంలో సందడి చేశారు. తను హీరోగా నటిస్తున్న నూతన సినిమా ప్రమోషన్ కోసం ఖమ్మం వచ్చిన ఆయన నగరంలోని బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం సందడి చేశారు. ఈ నెల 4వ తేదిన విడుదల కాబోతున్న’ఊర్వశివో రాక్షసివో” సినిమా సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర హీరో కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, సినిమా విశేషాలను వివరించారు. సినిమాలోని పాటలకు హీరో నృత్యాలు చేసి అలరించారు. డైలాగ్లు చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హిరో అల్లు శిరీష్ మాట్లాడుతూ…కామెడీతో పాటు మంచి కధతో కూడుకున్న సినిమా అని, అందరిని అలరిస్తుందన్న నమ్మకముందన్నారు.

allso read- మునుగోడులో ఎమ్మెల్యే ఈటెల కాన్వాయ్ పై దాడి

ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ హజరుకావడం ఆనందంగా ఉందని, సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ మీటన్ను మళ్ళీ ఖమ్మంలో నిర్వహిస్తామన్నారు. మంచిమంచి సినిమాలతో భవిష్యత్ లో మీముందుంటానని, ప్రస్తుతం అతి కొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న ఊర్వశివో రాక్షసివో సినిమా సూపర్ సక్సెస్ చేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు. సినిమా చాలా బాగుంటుందని, ప్రజలందరు చూడాల్సిన సినిమా అని అన్నారు. కుటుంబ కథా, లవ్, హాస్యంతో కూడిన కమర్షయల్ సినిమా అని అన్నారు. ఈ సినిమాలో మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయని తెలిపారు. నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శకుడు, నిర్మాతకు, నాతో పాటు పనిచేసిన హీరోయిన్, టెక్నిషయన్, నటినటులందరికి ధన్యవాదాలు తెలిపారు. అన్నయ్య మంచి సినిమాలతో బిజీగా ఉన్నారని అన్నారు. నా వెంటే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తారని తెలిపారు.మామయ్యలు మెగస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, తాతయ్య అల్లు అరవింద్, సినిప్రముఖుల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, వారందరికి రుణపడి ఉంటానని అన్నారు. నా సినిమా అడియో పంక్షన్ కు హీరో నందమూరి బాలకృష్ణ హజరుకావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బొమ్మ విద్యాసంస్థల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, లక్ష్మీరాజ్యం, అనూష, ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు పాల్గోన్నారు.

allso read- 15 రోజులుగా మునుగోడులోనే మంత్రి పువ్వాడ మకాం