Telugu News

ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’

== చూసేందుకు ఎగబడిన అభిమానులు

0

ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’

== చూసేందుకు ఎగబడిన అభిమానులు

== బందోబస్తు నిర్వహించిన పోలీసులు

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 7(విజయంన్యూస్)

సిని హీరో, డైనమిక్ స్టార్ రామ్ పోతినేని ఖమ్మంలో సందడి చేశారు. ఖమ్మం  నగరంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ముందుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హీరో రామ్, హీరోయిన్ రితూవర్మతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు.

ఇది కూడా చదవండి: చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి

అనంతరం షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు, హీరోయిన్ రితూవర్మ జ్యూయలరీని ప్రారంభించగా, హీరో రామ్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ఖమ్మం అంటే నాకేంతో ఇష్టమని, ఖమ్మంతో నాకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారని, ఆ అభిమానం అలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అభిమానులు మెచ్చే సినిమాలు చేస్తున్నానని, అతి త్వరలో మంచి సినిమాతో రాబోతున్నానని, అభిమానులు మరింతగా అధరించి అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. షాపింగ్ మాల్ అద్భుతంగా బిజినెస్ కావాలని, ప్రజలందరు ఆ షాపింగ్ ను అదరిస్తారాని అన్నారు.

== ఎగబడిన జనం

హీరో రామ్ ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. హీరో రామ్ ను చూసేందుకు ఎగబడ్డారు. రామ్ కారులో నుంచి బయటకు రాగానే అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బౌన్సర్లు, పోలీసులు కొంత ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికి ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందబోస్తు వల్ల ఎలాంటి ఇబ్బంది కల్గలేదు. హీరో రామ్ అభిమానులకు అభివాదం చేశారు. అందరికి హాయ్ చెప్పారు. చాలా మంది అభిమానులకు సెల్పీ పోటోలకు అవకాశం కల్పించారు. అలాగే హీరో రామ్ తో పోటోలు దిగేందుకు యువతీ, యువకులు ఆరాటపడ్డారు.