Telugu News

తెగిపోయిన రోడ్డును పరిశీలించిన భట్టి విక్రమార్క

మధిర చెరువును పరిశీలన

0
మధిర చెరువును పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మధిర/ఖమ్మంప్రతినిధి, జులై 19(విజయంన్యూస్)
 తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు  శనివారం మధ్యాహ్నం మధిర చెరువును పరిశీలించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువు నుండి పొంగిపొర్లుతూ అలుగు పోస్తున్నది. అలుగు ద్వారా చెరువు నుంచి దిగువకు వెళ్తున్న వరద నీరు ను పరిశీలన చేశారు. వరద నీరుతో చెరువు నిండుతున్న నేపథ్యంలో చెరువు కండిషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజు వారిగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఫోన్ చేసి సూచించారు. చెరువు దిగువనున్న రైతులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని భట్టి విక్రమార్క, కౌన్సిలర్ కోన దని కుమార్, మాజీ సర్పంచ్ కర్నా టీరామారావు, మధిర మండల ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కోరంపల్లి చంటి, మధిర మండల బీసీ సెల్ అధ్యక్షుడు సిలివేరు బుచ్చిరామయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరివేద రాంబాబు, మధిర మండల సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరి శీను, మైలవరపు చక్రి తదితరులు ఉన్నారు.
★★ తెగిపోయిన రోడ్డును పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*
మధిర మండలం మాటూరు నుంచి మర్లపాడు వెళ్లే మార్గమధ్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కన ఉన్న తాత్కాలిక రోడ్డు రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ప్రవాహానికి తెగిపోయింది. విషయం తెలుసుకున్న మధిర శాసనసభ్యులు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం బ్రిడ్జి వద్ద తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. బ్రిడ్జి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు ఫోన్ చేసి యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కోన ధనికుమార్, కర్నాటి రామారావు తదితరులు ఉన్నారు.