Telugu News

ఖమ్మం జిల్లాలో మరో సూది హత్య

భార్యను ఇంజక్షన్ ఇచ్చి కడతెర్చిన భర్త

0

ఖమ్మం జిల్లాలో మరో సూది హత్య

== భార్యను ఇంజక్షన్ ఇచ్చి కడతెర్చిన భర్త

== ఆడబిడ్డకు జన్మినించిన మరసటి రోజే తల్లి హత్య

== ఆనాదైన చిన్నారి..

== చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్య సంఘటన

== చవతిపోరుతో వేగలేక భార్యను చంపిన భర్త

== సంచలనంగా మారుతున్న మత్తు ఇంజక్షన్ తో మర్డర్

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 22(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాలో సూది హత్యలు సంచలనంగా మారాయి.. ఇటీవలే ముదిగొండ మండలంలోని వల్లభిలో ఇంజక్షన్ తో హత్య చేసిన సంఘటన మరవక ముందే మరో సంఘటన బయటపడింది.. నాటి కేసులో వివాహేతర సంబంధం కోసం భర్తను భార్య హత్య చేయిస్తే, నేటి కేసులో చవతి పోరు వేగలేక చిన్న భార్యను ఇంజక్షన్ ద్వారా హత్య చేసిన సంఘటన ఇటీవలే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని సూది హత్యలుహాట్ టాఫిక్ గా మారాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ALLS0 READ- ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు టోకరా

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన తేజావత్ బిక్ష్మం  ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఆర్ఎంపీ వైద్యుడిగా కూడా పనిచేస్తున్నాడు. అయితే తనకు ఇద్దరు భార్యలున్నారు. చిన్న భార్య నవీనాకు పెద్ద భార్యకు ఇటీవలే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారి ఇరువురి మధ్యన చవతిపోరును బిక్షం భరించలేకపోతున్నాడు. అయితే చిన్న భార్య అప్పటికే గర్భిణి కావడం జరిగింది. ఆమెకు ఇప్పటికే కుమార్తే ఉండగా, మరో కుమార్తే పుట్టే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. ఒక వైపు చవతి పోరు, మరో వైపు ఆడబిడ్డలకు జన్మినిస్తున్న క్రమంలో చిన్న భార్య నవీనాను బిక్షం హత్య చేయాలనుకున్నాడు. గర్భణిగా ఉన్నప్పుడైతే ఇబ్బంది అనుకున్న ఆయన ఆసుపత్రిలోనే హత్య చేస్తే ఆ నేపం ఆసుపత్రిపై వేయోచ్చని పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న ఆయన హత్యకు సిద్దమైయ్యాడు.

== నిండు బాలింతను హత్య చేసిన క్రూరభర్త

బిక్ష్మం తన రెండవ భార్య నవీనాను జులై 30న నిండు గర్భణిగా ప్రసవం కోసం ఖమ్మం నగరంలోని డాక్టర్ శశిబాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీంతో జులై 30న ఆమెకు సర్జరి ద్వారా పాప జన్మించింది. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ శశిబాల కుటుంబ సభ్యులకు, భర్తకు చెప్పారు. దీంతో భర్తలో దాగి ఉన్న క్రూరమగం బయటకు వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నవీనాను చంపేసి ఆసుపత్రి పై నేపం వేయాలని భావించి జులై 31న తెల్లవారుజామున ఆమె భర్త ముందే తెచ్చుకున్న మత్తు ఇంజక్షన్ ను నవీనా కు ఎక్కించాడు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ శిశిబాల ఆసుపత్రిపై దౌర్జన్యం చేసి డబ్బులు ఇప్పించాలని ప్లాన్ చేశారు. ఆసుపత్రి వద్ద బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. రూ.5లక్షలను పెద్ద మనుషులు సెటిల్ చేసి వెళ్లారు.

== అసలు నిజం ఇలా బయటపడింది

నిండు ఆరోగ్యంగా ఉన్న తేజావత్ నవీనా ఎలా చనిపోయిందనే విషయంపై డాక్టర్ శిశిబాల చాలా సుదీర్ఘంగా ఆలోచించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని సీసీ పోటోజీ తెప్పించుకుని చూసింది. దీంతో నవీనా ఎలా చనిపోయిందనే విషయాన్ని చూసి డాక్టర్ నివ్వరబోయినట్లు అయ్యింది. అంతా సైలేంట్ గా మారిపోయిన డాక్టర్ కొంత సమయం తరువాత జరిగిన సంఘటనపై డాక్టర్స్ యూనియన్ వారికి చెప్పింది. దీంతో వైద్యలందరు కలిసి పోలీస్ కమీషనర్ తో చర్చించి విషయాన్ని తెలిపారు. తన భర్త నవీనాను ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని, అందుకు సంబంధించిన సీసీ పోటేజ్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖమ్మం రూరల్ ఏసీపీ బిక్షంను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇన్ని రోజుల తరువాత ఎలా బయటపడిందంటే ముదిగొండ మండలంలోని వల్లభిలో జరిగిన ఇంజక్షన్ హత్య తరువాత తీవ్రంగా చర్చ జరిగింది. కాగా ఒకరి నోట మరోకరికి చేరడంతో ఖమ్మంలోని జడ్పీసెంటర్ లో ఓ ఆసుపత్రిలో హత్య జరిగిందని జర్నలిస్టులు పెద్ద ఎత్తున కథనాలు రాయడంతో అసలు కథ బట్టబయలైంది.

== సంచలనంగా మారిన ఇంజక్షన్ హత్య

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే హత్యలు జరిగిన సంగతి పాఠశాకులకు తెలిసిందే. ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక విషయంలో భర్తను భార్య ప్రియుడి కోసం హత్య చేస్తే, చవతుల మధ్య పోరును తట్టుకోలేక రెండ భార్యను హత్యచేశారు. ఈ రెండు సంఘటనలతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు, ఆరోగ్యశాఖ అప్రమత్తమైయ్యారు.