Telugu News

కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్ళు: మంత్రి పువ్వాడ

ఘనంగా కవులకు అవార్డుల పంపిణి కార్యక్రమం

0

కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్ళు

== అవార్డుల పంపిణి కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 28(విజయంన్యూస్)

కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్ళు వంటి వారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సాహితీ మాణిక్యం పురస్కార ప్రధాన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురు కవులకు రచయితలకు మంత్రి అజయ్  పురస్కారాలను ప్రధానం చేశారు. కవులు బంగారు తెలంగాణ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ప్రతి సంవత్సరం తెలుగుమహాసభల పేరుతో కవులకు అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కవులకు మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు. కవుల్లో ఉన్న ఉత్తేజం, ఉత్సాహం చూస్తే చాలా ఆనందం కలుగుతుందని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కవి, విమర్శకులు, కాళోజీ అవార్డు గ్రహీత డా. సీతారాం ప్రతి సంవత్సరం తన మాతృమూర్తి పేరిట ఇచ్చే సాహితీ మాణిక్యం పురస్కారాలు  2020-21 సంవత్సరాలకు ఎంపికైన  కవులు,కవయిత్రులు ఆకెళ్ళ రవి ప్రకాష్, షాజహానా, జూపాక సుభద్ర, వనపట్ల సుబ్బయ్యలకు పురస్కారాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతులమీదుగా ప్రధానం చేశారు.

ఇది కూడా చదవండి : సర్వం సిద్దమైన సర్కార్ మెడికల్ కళాశాల