Telugu News

జీవితకాలమంతా జనంకోసం ధారపోసిన మహావీరుడు లక్ష్మణ్ బాపూజీ: మంత్రి పువ్వాడ

ఖమ్మం వికారం ట్యాంక్ బండ్ పై లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

0

జీవితకాలమంతా జనంకోసం ధారపోసిన మహావీరుడు లక్ష్మణ్ బాపూజీ

** ఖమ్మం వికారం ట్యాంక్ బండ్ పై లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి, విజయం న్యూస్)

తొలి తరం ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన కొండా లక్ష్మణ బాపూజీ. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా, తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారని, వారి జీవితం భావి తరాలకు ఆదర్శనీయుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఇది కూడా చదవండి:- ఏఐసీసీ లో రాజస్తాన్ రగడ

ఆచార్యా కొండా లక్ష్మణ బాపూజీ గారి 107వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రం లకారం ట్యాంక్ బండ్ నందు ఎర్పాటు చేసిన లక్ష్మణ బాపూజీ గారి విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు విగ్రహానికి మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ నామా నాగేశవరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి, సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వరరావు  అధ్యక్షత జరిగిన సభలో వారు మాట్లాడుతూ..

బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని కొనియాడారు.

ఇది కూడా చదవండి:- కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి పువ్వాడ అజయ్

ప్రజా నాయకుడిగా, ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలు పార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు.

బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేసారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్పూర్తి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి వున్నదన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవం కల్పించారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

నేతన్నలైన పద్మశాలి కార్మికులను ఆదుకోవాలనే సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు శాశ్వత పరిష్కార దిశగా చేనేత ఔలిక శాఖ ద్వారా బతుకమ్మ చీరల పథకాన్ని నేతన్నలు ఇచ్చి రూ. 330 కోట్లతో వారిని ఆర్ధికపరిపుష్టిగా నిలిపారని అన్నారు.

చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు.

సబ్బండ వర్గాల అభివృద్ది సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని తెలిపారు.

మలి దశ ఉద్యమానికి అప్పటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి అండగా, తోడుగా నిలిచి జల దృశ్యం ను ఆవిష్కరించారని అన్నారు.

తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చిన నాయకుడు కొండా లక్ష్మణ్ గారు అని, అన్ని వర్గాల పక్షాన పోరాడిన గొప్ప నాయకులు అని అన్నారు.

చేనేత ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మహిళలకు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను చేనేత లు తయారీ చేసినవే అని గుర్తు చేశారు.

వారి చిరకాల స్వప్నం అయిన స్వరాష్ట్ర తెలంగాణ ను చూడకుండా వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం హర్షించదగిన విషయం అని అన్నారు.

ఇది కూడా చదవండి:- ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ: మంత్రి పువ్వాడ 

తెలంగాణ వైతాళికులు గౌరవించుకునే సంస్కృతిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రం ట్యాంక్ బండ్ నందు ప్రతిష్టించుకోడం వారికి మనం ఇచ్చే గౌరవం అన్నారు.

వైతాళికులు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడికి వచ్చే చిన్న పిల్లలు, యువతకు ఆయా మహనీయుల ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉందన్నారు.