నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..మంత్రి పువ్వాడ
పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్
నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..మంత్రి పువ్వాడ
** పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్
(ఖమ్మం -విజయం న్యూస్)
ప్రజలను నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు.
Allso read:- అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..*
మంత్రి జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణం, లోపల జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
అన్ని గదులు ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని, విద్యుత్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. భవనం మొత్తం తిరిగి విద్యుత్ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్యలకు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ తో పాటు ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Allso read:- రెండు గంటల ముందే బారులు తీరిన అభ్యర్థులు
వారి వెంట అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి గారు, ఆర్ అండ్ బి ఎస్ఇ. లక్ష్మణ్ , ఇఇ శ్యామ్ ప్రసాద్, విద్యుత్ SE, ADE రమేష్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.