Telugu News

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ఒక్కో యంత్రం రూ. లక్షా.. తొమ్మిది మందికి పంపిణీ..

0

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

*▪️ఒక్కో యంత్రం రూ. లక్షా.. తొమ్మిది మందికి పంపిణీ..*

(ఖమ్మం-విజయం న్యూస్)

కులవృత్తుల ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Allso read:- నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..మంత్రి పువ్వాడ

దశాబ్దాల కాలంగా కుమ్మరి, శాలివాహన కుల వృత్తిదారులకు జీవనాధారం అయిన మట్టి పాత్రల తయారీపై ఆధార పడ్డ కుటుంబాలను మరింత సులువైన పద్దతి ద్వారా ఉపాధి పొందాలని వారికి ఆధునాతన యంత్రాలను నేడు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి అన్నారు.

బిసి సంక్షేమ శాఖ వారి అధ్వర్యంలో విద్యుత్ తో పనిచేసే అధునాతన పరికరాలను ఆయా వృత్తిదార్లకు సోమవారం VDO’s కాలనీ క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పంపిణీ చేశారు.

Allso read:- అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..*

ఒక్కో యూనిట్ రూ. లక్ష రూపాయల తొలి విడతలో భాగంగా 9మందికి యంత్రాలు అందిస్తున్నామని తద్వారా ఆయా పరికరాల ఉత్పత్తి వేగంగా, సులువుగా, ఎక్కువ మోతాదులో తయారుచేసే అవకాశం ఉందన్నారు.

కుండలు తయారు చేయడం చాలా శ్రమ, నైపుణ్యంతో కూడిన పని అని, ఎంతో సహనం కూడా అవసరమన్నారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, BC వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోతి, దరిపల్లి శ్రీను, దునుకు నర్సింహారావు, కుదురుపాక నర్సయ్య, దరిపల్లి కిరణ్, తోర్లుకొండ నర్సింహారావు తదితరులు ఉన్నారు.