ఖమ్మం అభివృద్ది కావాలంటే అది సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని, ఆయన ఆశీర్వాదంతో ఇప్పటికే నగరంలో వందల కోట్ల నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పవు్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో శనివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముమ్మరంగా పర్యటించారు.
allso read- జుజ్జులరావుపేట వెంచర్ పై అధికారుల నజర్
ముందుగా ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.4.07 కోట్లతో నిర్మించనున్న సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఖమ్మం నగరంలోని 30వ డివిజన్ సన్ గ్లోరీ స్కూల్ లైన్, పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.45 లక్షలు, 34వ డివిజన్ ఫిల్టర్ బెడ్ లేన్, పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.47 లక్షలు, 36వ డివిజన్ ఉషా స్టూడియో లేన్, పీఎస్ఆర్ రోడ్ నందు రూ.45 లక్షలు, 35వ డివిజన్ అంబేడ్కర్ విగ్రహం, వద్ద బురదరాఘవపురం నందు రూ.45 లక్షలు, 47వ డివిజన్ వెంకటేశ్వర నగర్ నందు రూ.45 లక్షలు, 48వ డివిజన్ సారధి నగర్ నందు రూ.45 లక్షలు, 38వ డివిజన్ మస్జిద్-ఎ-సల్ఫియా లేన్, ఖిల్లా నందు రూ.45 లక్షలు, 37వ డివిజన్ కేఎల్ఎం షాపింగ్ మాల్ వద్ద రూ.45 లక్షలు, 49వ డివిజన్ వివేకానంద స్కూల్ వద్ద రూ.45 లక్షలు మొత్తం రూ.4.07కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్స్ & డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపన చేశారు.
== వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరం దినదినాభివృద్ధిచెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్, నాన్‌వెజ్‌మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించనున్నారు. ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పరిశీలించారు.

