Telugu News

ఖమ్మం నగర అభివృద్దే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ

పౌరసన్మాన కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా సన్మానం

0

ఖమ్మం నగర అభివృద్దే నా లక్ష్యం

== హైదరాబాద్ తరహాలో తయారు చేయడం కోసమే తపన

== నగరం అభివృద్ది చెందితే అన్ని రంగాలు బిజినేస్ పెరుగుతుంది

== ప్రతి అభివృద్దికి ప్రజలందరు సహాకరించాలి

== పౌరసమితి, పౌర సన్మాన కమిటీ సన్మానం మర్చిపోలేనిది

== ప్రజల ప్రేమానుభందాలను మర్చిపోలేను

== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన.. గజమాలతో సత్కారం

== పౌరసన్మాన కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా సన్మానం

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 18(విజయంన్యూస్)

ఖమ్మం నగరం సమగ్రాభివృద్దే తన లక్ష్యమని, అందు కోసం ఎంతటి దూరం అయిన వెళ్లేందుకు, ఎన్నిగంటలైనా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరంను మరింతగా అభివృద్ది చేసేందుకు తన వంతు క్రుషి చేస్తున్నాని మంత్రి పువ్వడ అజయ్ కుమార్ తెలిపారు.

ఇది కూడ చదవండి: ఆర్టీసి ప్రజల అస్థి : మంత్రి పువ్వాడ అజయ్

ఆదివారం పౌరసన్మాన కమిటీ, పౌర సమితి ఆధ్వర్యంలో రాజకీయేతర  పక్షాలైన  ప్రజా ,పౌర ,స్వచ్చంద , కుల ,వృత్తి , వ్యాపార , ఉద్యోగ , ఉపాధ్యాయ,కార్మిక ,కర్షక సంఘాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, సూపర్ సక్సెస్ అయ్యింది. ముందుగా ఖమ్మం త్రీటౌన్ గాంధీచౌక్ ప్రాంతంలోని వర్తకసంఘం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఘనంగా సన్మానం చేసి అక్కడ నుంచి భారీ ర్యాలీగా సప్తపది పంక్షన్ హాల్ కు బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నేను ఖమ్మంనియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన మొదటి ఏడాదిలోనే అద్భుతమైన అభివద్ది పనులు తీసుకొచ్చి ఖమ్మం రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నం చేశానని అన్నారు. అనంతరం రెండవ ప్రభుత్వం హాయంలో సీఎం కేసీఆర్ నాకు తన మంత్రి వర్గంలో చోటు కల్పించారని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్నానని, ఈ మూడేళ్ల కాలంలో ఖమ్మం నగరం అభివద్ది ఏంటో ప్రజలందందరికి తెలుసని అన్నారు. ఐటీ హబ్, లకారం ట్యాంక్ బండ్, గోళ్లపాడు చానల్, 4000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటింటికి ప్రభుత్వసంక్షేమ పథకాలు ప్రతి వీధిలో రహదారులు, ప్రతి డివిజన్ అభివద్దికి క్రుషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కచ్చితంగా మరింతగా ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ సిటి తరువాత ఖమ్మం సిటి అనే విధంగా డెవలఫ్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని, ప్రజలందరు అందుకు సహాకరించి ఆశీర్వదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: ఇద్దరు ఎంపీలకు, ఎమ్మెల్సీకి అవమానం

మరో ఐదేళ్లలో ఖమ్మం నగరం హైదరబాద్ ను తలపిస్తుందన్నారు. ఇప్పటికే ప్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ వచ్చాయని అన్నారు. ఖమ్మం నగరం వ్యాపార కేంద్రంగా మారిందన్నారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దీవెనలు ఉండటం వల్లనే సాధ్యమైందన్నారు. మరింత అభివద్ది చేస్తానని తెలిపారు.

== మంత్రికి ఘనంగా సన్మానం

ఖమ్మం నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివద్ది చేస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను గుర్తిస్తూ పౌరసమితి, పౌర సన్మాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గాంధీచౌక్ లో గజమాలతో సన్మానించిన సంఘాల నాయకులు, ప్రజలు, సప్తపది పంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. జ్జాపికను అందజేశారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ

ఈ కార్యక్రమంలో పౌర సన్మాన ఆహ్వాన కమిటీ బాధ్యులు ఎస్ కె అఫ్జల్ హాసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, కొప్పు నరేష్, గుడవర్తి శ్రీనివాస్, పొన్నం వెంకటేశ్వర్లు, కె. ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, సాగర్, రాజేష్, అకీమ్, అమరగాని వెంకన్న, మధు,గుమ్మడి శ్రీనివాస్ తదితరులు హాజరైయ్యారు.

== సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : మంత్రి

నాపై అభిమానం తో పౌర సన్మానం లో  పాల్గొన్న రాజకీయేతర  పక్షాలైన  ప్రజా, పౌర, స్వచ్చంద, కుల, వృత్తి, వ్యాపార ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి పేరు పేరున  నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. మీప్రేమాభిమానాలజల్లులో  తడిసి  ముద్దయ్యాను, మీరు నాపై  చూపిన ఈ అభిమానం నాలో మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. మీరు  ఇచ్చిన ఈ సహకారం తో  భవిష్యత్తులో మీ  అంచనాలకు తగ్గకుండా  పనిచేస్తానని మీ  ప్రేమాభిమానాలు మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగె కొనసాగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే పౌర సన్మానాన్ని ఘనంగా నిర్వహించుటకు సహకారం అందించిన ప్రజాసంఘాలఆహ్వాన కమిటీ కి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి:  గ్యాస్ ప్రమాద బాధితులకు పరిహారం: మంత్రి పువ్వాడ