Telugu News

ఖమ్మం లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ

పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

0

ఖమ్మం లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ

** పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

(ఖమ్మం ప్రతినిధి -విజయంన్యూస్)

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పాల్గోన్నారు.

ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

Allso read:- ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని

జడ్పీసెంటర్ నుండి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి కలెక్టరేట్, టీటీడీసీ, ఇల్లందు సర్కిల్, పటేల్ స్టేడియం మీదగా ఎస్ఆర్అండ్బీ కళాశాలకు చేరుకున్నారు. అనంతరం ఎర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మధు సుధన్, స్నేహలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు తదితరులు ఉన్నారు.