Telugu News

ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ: మంత్రి పువ్వాడ 

బతుకమ్మ చీరేలను పంపిణి చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ

== కుటుంబపెద్దన్నగా సీఎం కేసీఆఱ్ ఆడబిడ్డలకు చీరెలు పంపిణి

==  ఖమ్మం జిల్లాలో 5లక్షల మందికి చీరెలను పంపిణి చేస్తున్నాం

== కష్టకాలంలో కూడా ఆడబిడ్డలకు అండగా ఉన్నాం

== బతుకమ్మ చీరేలను పంపిణి చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== హాజరైన ఎంపీలు నామా, గాయత్రి రవి

== రఘునాథపాలెం, ఖమ్మం కార్పొరేషన్ 10, 12, 17,27, 29, 31వ డివిజన్లలో పంపిణి..

== రూ.339 కోట్లతో 24 విభిన్నమైన డిజైన్స్, 10రకాల రంగులు, 240 రకాల అంచులతో చీరలు.

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 23(విజయంన్యూస్)

ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని, ఆ పండుగకు ఆడబిడ్డలకు పెద్దన్నయ్యగా సీఎం కేసీఆర్ చీరెలను పంపిస్తున్నారని, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 10, 12, 17,27, 29, 31 వ డివిజన్ లలో శుక్రవారం ఎంపి లు నామా నాగేశ్వర రావు గారు, వద్దిరాజు రవిచంద్ర, మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి చీరెలు పంపిణీ చేశారు.

allso read- త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మన సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ, బోనాలు పండుగలను వైభవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో 5 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ కీలకపాత్ర పోషించిందని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలందరినీ ఏకం చేసి బతుకమ్మ ద్వారా ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని, తెలంగాణ రాష్ట్ర కాంక్షను రగిలించారని మంత్రి గుర్తు చేశారు. పూలను పూజించే పండుగ దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.

allso read- ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?

ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రపంచంలో ఈ పండుగకు గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని అన్నారు. బతుకమ్మ కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీర కానుకగా ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, డిఆర్డీవో విద్యాచందన, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, సర్పంచ్ శారద, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.