Telugu News

ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ పర్యటన

రూ.4.07కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..

0

ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ పర్యటన

== రూ.4.07కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలోని  పలు డివిజన్ లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  శనివారం ముమ్మరంగా పర్యటించారు. నగరంలోని పలు డివిజన్లలో రూ.4.07 కోట్లతో నిర్మించనున్నసీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో మోగిన మున్సిపల్‌  ఎన్నికల నగారా

ఖమ్మం నగరంలోని 30వ డివిజన్ సన్ గ్లోరీ స్కూల్ లైన్, పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.45 లక్షలు, 34వ డివిజన్ ఫిల్టర్ బెడ్ లేన్, పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.47 లక్షలు, 36వ డివిజన్ ఉషా స్టూడియో లేన్, P.S.R రోడ్ నందు రూ.45 లక్షలు, 35వ డివిజన్ అంబేడ్కర్ విగ్రహం, వద్ద బురదరాఘవపురం నందు రూ.45 లక్షలు, 47వ డివిజన్ వెంకటేశ్వర నగర్ నందు రూ.45 లక్షలు, 48వ డివిజన్ సారధి నగర్ నందు రూ.45 లక్షలు, 38వ డివిజన్ మస్జిద్-ఎ-సల్ఫియా లేన్, ఖిల్లా నందు రూ.45 లక్షలు, 37వ డివిజన్ KLM షాపింగ్ మాల్ వద్ద రూ.45 లక్షలు, 49వ డివిజన్ వివేకానంద స్కూల్ వద్ద రూ.45 లక్షలు మొత్తం రూ.4.07కోట్లతో నిర్మించనున్న CC రోడ్స్ & డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపన చేశారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం నగరం అభివృద్దికి అందరు సహాకరించండి: మంత్రి

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర ముక్తార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, కార్పొరేటర్లు ముక్కాల కమల, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, పసుమర్తి రాం మోహన్, మాటేటి అరుణ నాగేశ్వరరావు, తోట గోవిందమ్మ రామారావు, ఆలియ షౌకత్ అలీ, కర్నాటి కృష్ణ, బుడిగెం శ్రీను, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE లు స్వరూప రాణి, నవ్య జ్యోతి, రంగారావు, RJC కృష్ణ, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.