Telugu News

ఖమ్మం నగరం అభివృద్దికి అందరు సహాకరించండి: మంత్రి

రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

0
ఖమ్మం నగరం అభివృద్దికి అందరు సహాకరించండి: మంత్రి
== రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు
ఖమ్మం ప్రతినిది, నవంబర్ 4(విజయంన్యూస్)
ఖమ్మం నగరం మరింత  అభివృద్ది చేసేందుకు ప్రజలందరు సహాకరించాలని,  అభివృద్ది చేసే పార్టీని, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడం వల్ల మరింత  అభివృద్ది జరిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.శుక్రవారం ఖమ్మం నగరంలోని  పలు డివిజన్ లలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.
  ఖమ్మం నగరంలోని 2వ డివిజన్ బల్లేపల్లి లో రూ.45 లక్షలు, 4వ డివిజన్ బల్లేపల్లి స్టేజ్ నందు రూ.45 లక్షలు, 9వ డివిజన్ శ్రీశ్రీ సర్కిల్ లో రూ.45 లక్షలు, 13వ డివిజన్ శ్రీ నగర్ కాలనీలో రూ.45 లక్షలు, 11వ డివిజన్ కవిరాజ్ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.2.25 కోట్లతో నిర్మించనున్నసీసీ రోడ్లు, డ్రైనేజీ  నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.ఈ   కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, ఎస్ కె.జాన్ భీ, సరిపుడి రమాదేవి, కొత్తపల్లి నీరజ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ లు స్వరూప రాణి, నవ్య జ్యోతి, రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.