Telugu News

బహుభాషా పండితుడు పీవీ: మంత్రి

కేంద్ర ప్రభుత్వం పీవీని విస్మరించడం బాధాకరం

0

బహుభాషా పండితుడు పీవీ: మంత్రి

◆◆ కేంద్ర ప్రభుత్వం పీవీని విస్మరించడం బాధాకరం

◆◆ పీవీకీ నివాళ్ళు అర్పించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి, జూన్ 28(విజయం న్యూస్)

తెలుగు బిడ్డ, బహుజాతిపండితుడు పీవీ నర్సింహారావు అని, అలాంటీ మహానీయుడు, మాజీ ప్రధాని ని కేంద్రప్రభుత్వం విస్మరించడం బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి ( జూన్ 28) సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు నివాళులు అర్పించారు.

ఖమ్మం నగరం మమత రోడ్ లోని లకారం సర్కిల్ లో గలపీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు.

Allso read:- మాదకద్రవ్యాలు లేని సమాజం నిర్మిద్దాం: మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

భారత మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు.

కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పీవీ కి భారత రత్న ఇవ్వాలని అన్నారు.

ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీ ని గౌరవించకపోవడం విచారకరమని అన్నారు. పీవీశతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.

మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి పీవీ నర్సింహా రావు  అని పేర్కోన్నారు.ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు అని మంత్రి కొనియాడారు.

ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.

దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడివున్నదని అన్నారు.

Allso read:- పోలీసులు.. సైకిల్ ఎక్కారు.. ఎందుకోసమంటే..?

సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని  నిరూపించారని తెలిపారు.

తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.