Telugu News

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా గిరిజన యువతి

నామినేషన్ దాఖలు చేసిన గంగబండతండా నివాసి వినోద

0

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా గిరిజన యువతి

== నామినేషన్ దాఖలు చేసిన గంగబండతండా నివాసి వినోద

== ఎందుకోసమంటే..?

(కూసుమంచి -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బంజారా బిడ్డ గురువారం నామినేషన్ దాఖలు చేసింది. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని, బంజారులకు పార్లమెంట్ లో సరైనా ప్రాతినిధ్యం లేదని, యువతకు ఉద్యోగావకాశాలు రావడం లేదని పలు సమస్యలను ప్రస్తావిస్తున్న ఆ యువతి ఖమ్మం పార్లమెంట్ సీటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. కూసుమంచి మండలం గంగబండతండాకు చెందిన వడ్తియా వినోద  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ప్లేయర్ గా గుర్తింపు పొందింది. క్రికెట్ అడుతూనే ఉన్నత చదువు చదివినా వినోద అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించింది. అయితే యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో రాణించాలి, దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందనే ఆలోచనతో, నేటి యువతకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో గిరిజన జాతి బిడ్డలకు న్యాయం జరగాలని కోరుతూ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు వడ్తియా వినోద మీడియాకు తెలిపింది.