Telugu News

తెలంగాణలో అభివృద్ధిపై ఎంపీ నామా ఎమన్నారంటే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ భరోసా కోరిన ఎంపీ నామా

0

తెలంగాణలో అభివృద్ధిపై  ఎంపీ నామా ఎమన్నారంటే

== సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ భరోసా కోరిన ఎంపీ నామా

== అభివృద్ధికి చిరునామ కేసీఆర్: నామా నాగేశ్వరరావు

== కేసీఆర్ కు మనమంతా అండగా నిలవాలి

== సీఎంఆర్ఎఫ్ చెక్కుల వెనుక నాయకుల కష్టం

== సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం , ఆగస్టు 23(విజయంన్యూస్) :

దేశంలో మరెక్కడా కేసీఆర్ లా అభివృద్ధిని కాంక్షించే సీఎం ఉండరని, ఆయన పేదల పక్షపాతి అని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తో కలసి 122 మందికి రూ . 47,71,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిదని, పేద వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ కు మనమంతా అన్ని విధాలా అండదండగా ఉండాలన్నారు.

ఇది కూడా చదవండి: కనులపండుగగా ‘పువ్వాడ’ వారి వివాహ రిసెప్షన్

రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కు మరింత మద్దతుగా నిలవాలన్నారు. దేశంలో ఎక్కడా కూడా కేసీఆర్ లాంటి అభివృద్ధికారక సీఎం ఉండరని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిగా చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పేదలను, రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి సీఎంఆర్ఎఫ్ చెక్కు వెనుక ఆ ప్రాంత నాయకుడి కష్టం, కృషి దాగుంటుందని అన్నారు. స్థానిక నాయకత్వం అవిరళ కృషి వల్లనే నేడు పేదలకు ఇంత భారీ ఎత్తున సీఎంఆర్ఎఫ్ సాయాన్ని అందించగలుగుతున్నామన్నారు. గతంలో కూడా వైరా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, అదే ఒరవడి సీఎంఆర్ఎన్ చెక్కుల విషయంలో కూడా కొనసాగుతుందన్నారు. పార్టీలకతీతంగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. నేడు వైద్యపరంగా కూడా ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. రైతు బంధు, బీమా లాంటి రైతు పథకాలు పెట్టిన ఘనత కూడా ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ ఎంపీ నామ అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన నామకు పేదల కష్టాలు తెలుసు కాబట్టే పేదల పక్షపాతిగా పనులు చేస్తున్నారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం ఎంపీ నామది అన్నారు . సీఎం ఆశీస్సులుండడం వల్లనే ఎంపీ నామ జిల్లా సమగ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ సాయాన్ని మంజూరు చేయించి, పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. నామ సిఫార్స్ చేస్తే ఇట్టే పనులు జరుగుతున్నాయని, ఇది జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు.

ఇది కూడా చదవండి : మాజీ మంత్రి తుమ్మల సంచనల వ్యాఖ్యలు

సీనియర్ పార్లమెంటేరియన్ ఎంపీ నామ లోక్ సభలో ఎన్నో సమస్యలను ప్రస్తావించారని అన్నారు. కేంద్రంపై పోరాడి, రాష్ట్రానికి నిధులు రావడంలో ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణాకు కేంద్రం అడుగడుగున అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టిస్తుందని అన్నారు. రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ కూరకులు నాగభూషణం, రాష్ట్ర మార్కెట్ఫడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జయపాల్, జూలూరుపాడు జెడ్పిటిసి భూక్యా కళావతి, ఏన్కూరు జెడ్పిటిసి బాదావత్ బుజ్జి, కొణిజర్ల జెడ్పిటిసి పోట్ల కవిత, వైరా జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, కనకమేడల సత్యనారాయణ , వైరా ఎంపిపి వేల్పుల పావని, సింగరేణి ఎంపిపి మాలోత్ శకుంతల , దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు , చింతలచెర్వు లక్ష్మీ , వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, కొణిజర్ల పార్టీ అధ్యక్షులు యంతాప్రగడ చిరంజీవి, ఏన్కూరు మండల పార్టీ అధ్యక్షులు సురేష్ , సింగరేణి మండల పార్టీ అధ్యక్షులు తోటకూర రాంబాబు, టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యులు చిత్తరు సింహాద్రి యాదవ్, ఉప్పనూతల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, యల్లంకి సత్యనారాయణ, ఎంపిటిసి వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, అడ్డగోడ ఐలయ్య , కొణిజర్ల సొసైటీ ఛైర్మన్ చెరుకుమల్లి రవి, బత్తుల శ్రీనివాసరావు, పాసంగులపాటి శ్రీను, పోగుల శ్రీనివాసరావు, కొలిపాక వెంకటేశ్వర్లు , ఏలూరు శ్రీనివాసరావు, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .