Telugu News

ఖమ్మం సత్తా మరోమారు నిరూపించాలి: జావిద్

తీన్మార్ మల్లన్న మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు

0

ఖమ్మం సత్తా మరోమారు నిరూపించాలి: జావిద్

== తీన్మార్ మల్లన్న మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు
== నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

(ఖమ్మం -విజయం న్యూస్)
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం సత్తా ఏంటో మరో మారు నిరూపించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మల్లన్న విషయాన్ని కాంక్షిస్తూ ఇండియా కూటమి పార్టీలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి బీఆర్ఎస్ ఒకటేనని ఇద్దరిలో ఎవరు గెలిచినా పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కావానీ గత పది ఏళ్లుగా తిన్నావా అవమానాలు ఎదుర్కొవడం జరిగిందని పేపర్ లీకేజీలు, భోగస్ ఉద్యోగ నియమాకాలు బీఆర్ఎస్ పాలనలో చరిత్ర సృష్టించాయని గుర్తు చేశారు. పట్టభద్రులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి మల్లన్నును గెలిపించాలని కోరారు.
అనంతరం ఆప్ పార్టీ తిరుమలరావు,CPM పార్టీ యర్రా శ్రీకాంత్,CPI తాటి వెంకటేశ్వరరావు,TDP వడ్డఫ్విజయ్,TJAC పార్టీ జల్లిపిల్లి రవి లు మాట్లాడుతూ INDIA కూటమి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల MLC అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని,పట్టభద్రులు ఎంతో విజ్ఞత కలవారని, వారికి ఎవరు ప్రతినిధిగా ఉంటే న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ తోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతుంది అని అన్నారు. ఏ అధికారం లేనప్పుడే ప్రజా సమస్యలపై పోరాడిన నికార్సైన వ్యక్తి మల్లన్న అని అధికారం ఉంటే ప్రజా సమస్యలపై ఎంత దూరం అయిన పోగల సమర్ధ నాయకుడు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా యువత కు అన్ని హామీలు నెరవేరేలా కృషి చేస్తా అని అన్నారు.పట్ట భద్రులు తమ అమూల్యమైన ఓటు రెండవ నెంబర్ దగ్గర 1 అని రాసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.