ఖమ్మం కాంగ్రెస్ కంచు కోట అని మరోమారు నిరూపించాలి: సంభాని
👉🏻మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్
👉🏻జూన్ లో ఖమ్మంలో పీపుల్స్ మార్చ్ ముగింపు సభ
👉🏻హాజరు కానున్న ఏఐసీసీ సభ్యులు
👉🏻సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు
👉🏻జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కంచుకోట అని మరోమారు నిరూపించాలని మాజీ మంత్రి వర్యులు సంబాని చంద్రశేఖర్ కోరారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ పై మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమయాత్త సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి రామి రెడ్డి గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జూన్ 10 నుండి 15 వ తేదీ మధ్యలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలో మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా కు చేరుకోనున్నదని అందులో భాగంగా టీపీసిసి, సీఎల్పీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో భారీ బహిరంగ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తాం: సంభాని
ఈ ముగింపు సభ కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పాల్గొనున్నారని తెలిపారు. అన్ని మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… రెండోసారి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా కష్టపడే తత్వం ఉన్న దుర్గాప్రసాద్ ను రెండోసారి నియమించినందుకు ఏఐసిసి, పీసీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 60 రోజుల నుంచి కొనసాగుతున్న సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర జూన్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఖమ్మం జిల్లాకు చేరుకుంటుందని అన్నారు. సీఎల్పీ అంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు విప్పటమే కాకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని మల్లు భట్టి విక్రమార్క ఎండనక వాననక ప్రజల మధ్య కలియ తిరుగుతూ నేరుగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించబోయే పాదయాత్ర ముగింపు సభలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సభ జరగనున్నదని తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: పువ్వాళ్ల దుర్గప్రసాద్
మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడుతూ…. ముందుగా జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.మత విద్వేషాలు నిండిపోయిన దేశంలో ప్రేమ ఆప్యాయతలు మెరుగు పరచాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇప్పటి వరకు సుమారు 900 కిలోమీటర్ల కొనసాగుతున్నదని అన్నారు. ఈ పాదయాత్ర వచ్చే నెల ఖమ్మం జిల్లా కు చేరుకుంటుందని అందులో భాగంగా ఖమ్మం లో నిర్వహించనున్న ముగింపు సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేసి మతోన్మాద పార్టీలను తిప్పికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ,పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు,పీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,ఖమ్మం నగర కాంగ్రెస్ కార్యనిర్వాహాక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,పీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు,పీసీసీ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,పీసీసీ సభ్యులు బైరు మనోహర్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,యడ్లపల్లి సంతోష్,జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,LDM ఇంచార్జ్ లు మద్దినేని రమేష్,మోతుకూరి ధర్మారావు,ఏనుగుల అర్జునరావు, నగర కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,లాకావత్ సైదులు నాయక్,పల్లెబోయిన భారతి చంద్రం,ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రామలక్ష్మణ్,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్, సాదే శంకర్,నగర మైనారిటి అధ్యక్షులు అబ్బాస్ భాయ్,నగర ST సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, శ్రీశైలం ఉమ్మడి జిల్లా నలు మూలల నుండి విచ్చేసిన బ్లాక్ /మండల /పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క