నేడు కానిస్టెబుళ్ల ప్రిలిమినరీ రాతపరీక్ష్
ఖమ్మం జిల్లాలో 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్థులు
నేడు కానిస్టెబుళ్ల ప్రిలిమినరీ రాతపరీక్ష్
== ఖమ్మం జిల్లాలో 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్థులు
==పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు
== పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
== ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 28(విజయంన్యూస్)
టీఎస్ఎల్ఫీఆర్బీ, జేఎన్టీయుహెచ్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా న నిర్వహించనున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్ళ ఆర్హత రాత పరీక్షకు హజరవుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:వైరా బస్ స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
ఇందులో ఖమ్మం నగరం, పరిసరాల పరిధిలోని 89 పరిక్ష కేంద్రాలలో 31,415 మంది అభ్యర్థులు, అదేవిధంగా సత్తుపల్లిలోని 16 పరిక్ష కేంద్రాలలో 8,136 మంది అభ్యర్థులు పరిక్ష వ్రాయనున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్లు పూర్తి చేశారని తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు తీసుకోనే విధంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావల్సి వుంటుందని, పరీక్షకు సంబంధించి నియమ నిబంధనలు హాల్ టికెట్లో పొందుపరిచి వుంటాయని, పరీక్ష గదిలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఇతర వస్తువులను అనుమతించరని తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా పారదర్శకంగా అమలవుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మరాదని, అలాంటి వ్యక్తులు ఏవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
== పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ వ్రాత పరిక్షల సందర్భంగా అయా పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలుల్లో వున్నందున ఆగష్టు 28 న ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో సమీపంలో జిరాక్స్ సెంటర్లు ముసివేయాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
Allso read:- పునాదుల్లోనే (పురిటి) నొప్పులు…