Telugu News

ఆయన దారేటు..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమేనా..?

0

ఆయన దారేటు..?

== పార్టీ మార్పు తథ్యం..?

== ఆ గట్టువైపా..? ఈ గట్టు వైపా..?

== స్పష్టం చేస్తున్న ఆయన వర్గీయులు

== ఆయనోక్కడేనా..? ఆయనతో అందరూనా..?

== తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమేనా..?

== గోడదూకేందుకు మస్తుమంది ఎదురుచూపు

(పెండ్ర అంజయ్య)

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 5(విజయంన్యూస్)

ఆయన జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సష్టించగల దమ్మున్న నాయకుడు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అనుకున్నది జరిగిపోద్ది.. ఆయన తలుచుకున్నాడంటే కొండనైనా తవ్వించగలడు..? గుంటల నడుమ తోవలను వేయగలడు.. ఆయన కనుసైగ చేస్తే రాజకీయాలే మారిపోతయు.. ఆయన చేయి ఊపితే కార్యకర్తలు చీమలదండు బయలుదేరుడు ఖాయం.. కదనరంగంలోకి దిగాడంటే తాడోపేడో తెల్చేస్తాడు.. ఆయన ఎక్కడ అడుగు  పెడితే అక్కడ మట్టి బంగారమవుతుంది..? బీటలు వారిన బీడు భూములు పచ్చని పోలాలువతాయి.. పశ్చిమగోదావరిని తలపిస్తాయి.. గుక్కెడు నీళ్లు అందలేని అత్యంత కరువుపీడత ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలడు.. నీళ్లు పుట్టని గుట్టల్లో సైతం నీటిని పారించగలడు.. అలాంటి నాయకుడు కచ్చితంగా అందరి గుండెల్లో నిలిచిపోతాడు.. అందర్ని ప్రేమను పొందుతాడు.. ఆయన దూరమైతే ప్రజలకు కష్టాలు దరిచేరతాయి.. కన్నీళ్లు మిగులుతాయి.. ఇలా ఎంత చెప్పిన ఆయనకు తక్కువే.. ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికి ఆయనకు పౌర్ణమి, అమావాస్య తప్పలేదు.. గెలుపోటములు తప్పలేదు..తమ్ముడ్ని తప్పుల నుంచి తప్పించేందుకు గట్టిగా మందలించడం ఆయన తప్పైంది..? నోటి దురుసు ఆయనకు కీడు తెచ్చింది.. జనంపై చీదరించుకుంటే ఆ జనమే చెదరిపోయారు.. అందుకే ఆయన రాజకీయంగా దూరమైయ్యాడు.. అయినప్పటికి ఆయన సంచలనమే.. ఆయన ఒక అడుగు వేస్తే ఆయన వెనకాల వంద అడుగులు వేసేందుకు మస్తు బలం ఉంది.. బలగం ఉంది.. జనబలం ఉంది.. ఆయన కనుసైగ చేస్తే చాలు రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యం.. ఆయన దారి చూపితే ఆ దారిలో నడిచేసేందుకు ఉమ్మడి జిల్లా కదలడం ఖాయం.. అదే జరగబోతుందేమో..? అనే సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి.. ఆయన రూట్ మార్చుడు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.. నేటి వేగవంతంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఆ నేత చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.. అయితే ఆయన ఒక్కడే రూట్ మారుస్తాడా..? ఆయన తోవలోనే మరింత మంది రూట్ మారుస్తారా..? అనేది సందేహాంగా ఉంది.. కానీ ఒక్క మాట.. ఆయన నాలుగు చక్రాల వాహనాన్ని దిగేస్తే.. ఆయన వెళ్లే దారిని పక్కకు మళ్లీస్తే ఆయన బాటలో బండెనక బండి కట్టే అన్నట్లుగా వందల మంది రూట్ మారడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి కూడా..? ఇంతకు ఆయనేవ్వరు..? ఆయన వెంట నడిచేదేవ్వరు.? వివరాలు చదవాలని ఉందా..? ఆయన ఈ లింక్ ను క్లిక్ చేసి పూర్తి వివరాలు చదవండి..

ఇది క్లిక్ చేయండి: – ఆయనేవ్వరో తెలుసుకోవాలని ఉందా..? అయితే చదవండి