18న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
విలేకర్ల సమావేశంలో తెలిపిన పౌర సన్మానం కమిటీ బాధ్యులు అఫ్జల్ హాసన్, పులిపాటి ప్రసాద్
18న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
** త్రీ టౌన్ లో భారీ ర్యాలీ
** విలేకర్ల సమావేశంలో తెలిపిన పౌర సన్మానం కమిటీ బాధ్యులు అఫ్జల్ హాసన్, పులిపాటి ప్రసాద్
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఈ నెల18న పౌర సన్మాన కార్యక్రమం చేస్తున్నామని పౌర సన్మాన ఆహ్వాన కమిటీ బాధ్యులు ఎస్ కె అఫ్జల్ హాసన్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, కొప్పు నరేష్ తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలోని సిక్వెల్ రిస్టాట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
Allso read- గ్యాస్ ప్రమాద బాధితులకు పరిహారం: మంత్రి పువ్వాడ
గత మూడు సంవత్సరాలుగా ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని, ఎన్నడు కనివిని వెరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. దానికి కారణం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంకల్ప బలమని అన్నారు. ఖమ్మం అభివృద్ధి ని చూసి యావత్తు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ప్రజలు ఈర్షపడుతున్నారని తెలిపారు. ఖమ్మం అభివృద్ధి తో అన్ని రంగాల్లో ముందున్నామని అన్నారు. అందుకే ఖమ్మంను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకేళ్తున్న రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను గౌరవించుకోవాలనే ఆలోచనతో పౌర సన్మానం ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో పౌరసన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలోని సప్తపది లో పౌర సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పౌరులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సన్మాన ఆహ్వాన కమిటీ బాధ్యులు గుడవర్తి శ్రీనివాస్, పొన్నం వెంకటేశ్వర్లు, కె. ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, సాగర్, రాజేష్, అకీమ్, అమెరికాని వెంకన్న, మధు,గుమ్మడి శ్రీనివాస్ తదితరులు హాజరైయ్యారు.
Allso read:- అసెంబ్లీలో కేంద్రంపై మండిపడిన మంత్రి పువ్వాడ