Telugu News

పువ్వాడ వివాహ రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు

రేపు ఖమ్మంలో ఘనంగా రిసెప్షన్

0

పువ్వాడ వివాహ రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు

★★ రేపు ఖమ్మంలో ఘనంగా రిసెప్షన్

★★ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 21(విజయంన్యూస్)

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంతలక్ష్మి దంపతుల తనయుడు నయన్, అపర్ణ వివాహమహోత్సవ వేడుక హైదరాబాద్ లో శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామోజీరావు, కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర సీఎస్, ఇరు రాష్ట్రాల మంత్రులు, సినీ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఎంతో వైబోపేతంగా ఈ కల్యాణం జరిగింది.

allso read- తమ్మినేని కృష్ణయ్య హత్యలో సూత్రదారులేవరు..? పాత్రదారులేవ్వరు..?

== 23 తారీఖున ఖమ్మంలో ఘనంగా రిసెప్షన్ వేడుకలు:-

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంత నియోజకవర్గమైన ఖమ్మం నియోజకవర్గంలోనె కుమారుడి రిసెప్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని  టేకులపల్లి మమతా సొసైటీ ఓపెన్ ల్యాండ్ లో ఈ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి నియోజకవర్గ ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల ప్రజలకు ఉన్న ఆత్మీయతో ఈ రిసెప్షన్ వేడుకకు భారీ ఎత్తున నియోజకవర్గ ప్రజలు తరలిరానున్నారు. నూతన దంపతులను ఆశీర్వదించేందుకు రిసెప్షన్ వేడుకకు రానున్న ఖమ్మం ప్రజానీకానికి స్వాగతం పలికేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వారి సతీమణి పువ్వాడ వసంతలక్ష్మీ ఉదయం 10:00 గంటలకే రిసెప్షన్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి  హాజరు కానున్న ప్రజానీకానికి పేరుపేరునా పలకరించనున్నారు.

== రిసెప్షన్ వచ్చేవారికి ఘనమైన అతిథి మర్యాదలు

రిసెప్షన్ వేడుకకు హాజరు కానున్న అతిథి మహారాజులకు  రుచికరమైన వంటల తోపాటు వారి బాగోగులు దగ్గరుండి చూసుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అత్యంత సన్నిహితులు భోజన స్టాల్ పర్యవేక్షణలు నిర్వహించనున్నారు. తన కుమారుడి రిసెప్షన్ వేడుకకు హాజరు కానున్న ప్రజానీకానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా బాధ్యత వహించాలని ఇప్పటికే 200 మంది తన సన్నిహితులైన  వ్యక్తులకు కీలకమైన బాధ్యతలు అందజేశారు.

allso raed- కల్యాణం..కమనీయం..పువ్వాడ వారి పరిణయం

★★ రిసెప్షన్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పువ్వాడ..

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్, అపర్ణ ల వివాహ రిసెప్షన్ ఖమ్మం నగరం టేకులపల్లిలోని మమత విద్యా సంస్థల స్ధలంలో ఘనంగా జరుగనుంది.ఆయా ఏర్పాట్ల పనులను మంత్రి పువ్వాడ సోమవారం స్వయంగా పరిశీలించారు. ఖమ్మంలో జరుగనున్న రిసెప్షన్ వేడుకకు అతిథులు పెద్ద ఎత్తున్న హాజరుకానున్న నేపద్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

వచ్చే అతిరథ మహారథులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. పార్కింగ్, త్రాగునీరు, భోజనాలు, సీటింగ్, తదితర ఎర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎంతమంది వచ్చినా, ఆలస్యంగా వచ్చినా అతిథులకు భోజన సౌకర్యం కల్పించాలని నిర్వాహకులను కోరారు. పకడ్బందీ ఏర్పాట్లలో భాగంగా విడి విడిగా స్టాల్స్ ఎర్పాటు చేయడమైనది, ప్రతి స్టాల్ కి ఇంఛార్జిలను నియమించమైందని వివరించారు.

వచ్చి పోయే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా తగు చర్యలు చేపట్టాలని, నిర్దేశించిన రూట్ మ్యాప్ ను నివేదించాలని పోలీస్ శాఖను కోరారు.