Telugu News

కల్యాణం..కమనీయం..పువ్వాడ వారి పరిణయం

నభూతో నభవిష్యత్ అనేలా అబ్బురపరిచే విధంగా ఏర్పాట్లు

0

కల్యాణం..కమనీయం..

◆ “హైదరాబాదల్ నేడు పువ్వాడ వారి పెళ్లి సందడి..”

 ◆నభూతో నభవిష్యత్ అనేలా అబ్బురపరిచే విధంగా ఏర్పాట్లు

◆ వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు..మాజీ సీఎంలు, సీనినటులు

◆హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పండుగ వాతావరణం

◆పోలీసు అధికారులతో కలిసి ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 19(విజయంన్యూస్)

కల్యాణం..కమణీయం.. నయన్,అపర్ణ పరిణయం.. అంగరంగ వైభవం పువ్వాడ వారి పెళ్లి సందడి.. నభూతో నభవిష్యత్ అనేలా పువ్వాడ వారి పెళ్లి సందడి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనదైన శైలిలో తన కుమారుడి వివాహానికి భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు.ఈనెల 20న రాత్రి 8:30 గంటలకు పువ్వాడ తనయుడి వివాహం శంషాబాద్ విమానాశ్రయంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇతర దేశాల నుంచి అలంకరణ సామగ్రి సేకరించి అల్ హంబర ప్యాలెస్ ను తలపించేలా భారీ సెట్టింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.దేశ,విదేశీ అతిధులు వచ్చే అందుకు అణువుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెళ్లి సందడి చేస్తున్నారు పువ్వాడ వారు.పువ్వాడ వారు ఎప్పుడు చేసిన ప్రత్యేక రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నరు.. తమ్మినేని

వివాహ వేడుకకు పెద్ద ఎత్తున అతిరథమహరాజులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడ ఇబ్బందులు జరగకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ వేదికతో పాటు రాకపోకలు చేసే రహదారులు, వేదిక వద్ద ప్రజలు, ప్రజాప్రతినిధులు కుర్చునేందుకు సిట్టింగ్, వారికి సౌకర్యాలు అన్నింటిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. సలహాలు, సూచనలు చేశారు. ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటు జరగొద్దని, చిన్న సమస్య కూడా రావోద్దని వర్కర్స్ సూచించినట్లు తెలిపారు. అలాగే వివాహానికి వచ్చే వారందరికి అద్భుతమైన అహ్వానం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

== వివాహానికి హాజరుకానున్న సీఎంలు, మాజీ సీఎం, మంత్రులు, సినినటులు

హైదరాబాద్ లో జరిగే పువ్వాడ వారి వివాహ మహోత్సవ కార్యక్రమానికి అతిరథమహారాజులు, సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల అధ్యక్షులు, సినినటులు, జడ్జీలు చాలా పెద్ద సంఖ్యలో హాజరైయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అసెంబ్లీ పక్ష పార్టీ నాయకుడు అసదుద్దిన్, మంత్రులు కేటీఆర్, హారీష్ రావు, మంత్రులు రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి : అబార్షన్ వికటించి యువతి మృతి

అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సినినటులు మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నందమూరి బాలక్రిష్ణ, తారకరామారావు, మహేష్ బాబు, ప్రభాష్,మరికొంత మంది సినినటులు, రాజకీయ ప్రతిపక్షాల నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్, ఉప మేయర్, చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.  అందుకు గాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ లో సైతం ఆకర్షణగా భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం వ్యాప్తంగా పువ్వాడ కానుకతో పాటు ఆహ్వాన పత్రికను ప్రజలకు అందజేశారు. దీంతో హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది.