ఖమ్మంలో ఐడీ దాడులు
== ప్రైవేట్ ఆసుపత్రిలపై ఐటీ దాడుల కలకలం
== బిలీఫ్, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ, గుర్నాథరావు ఆసుపత్రుల్లో దాడులు చేసిన అధికారులు
== పరేషాన్ లో ప్రవేట్ ఆసుపత్రులు!
== 30 బృందాలతో తెలంగాణలో ఈడీ, ఐటీ ముమ్మర దాడులు
== కొన్ని క్షణాల ముందే ఫైల్స్ ను బటయకు విసిరిన సిబ్బంది..?
== అసలేం జరిగింది..? ఎందుకు దాడులు
ఖమ్మంప్రతినిధి, నవంబర్ 9(విజయంన్యూస్)
ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపింది.. ఒక్కసారిగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐటీ,ఈడీ అధికారులు దాడులు నిర్వహించడంతో ఖమ్మం నగరంలో సంచలనం రేపింది.. ఎప్పుడు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల ఇండ్లను, ఆఫీసులను సోదా చేసే ఈటీ, ఐటీ అధికారులు ఆకస్మీకంగా ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులకు పాల్పడటంతో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల యజమాన్యం ఉలిక్కిపడినట్లైంది. ఖమ్మం నగరంలోని రెండు ఆసుపత్రులతో పాటు, ఒక టెస్ట్ ట్యూబ్ ఆసుపత్రి పై కూడా ఈటీ, ఐటీ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని బిలీఫ్ ఆసుపత్రి ఐటీ అధికారుల దాడులు సంచలనంగా మారాయి.. ఆంధ్రప్రాంతానికి చెందిన ఆ వైద్యులను టార్గెట్ గా చేసుకున్నారా..? లేదంటే గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహాయం చేశారని కేంద్రప్రభుత్వం దాడులు చేయిస్తుందా..? ఇందులో రాజకీయం తెరవెనక దాగుందా..? అనే విషయాలు, మ్మంనగరంలో జరిగిన దాడులకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే
ALLSO READ- ఇల్లందు వైస్ చైర్మన్ ఇంటిపై రాళ్ళ దాడి
హైదరాబాద్, కరీంనగర్లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు . మొత్తం 150 కి పైగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ముందుగానే ఎంచుకున్న ప్రాంతాలకు అత్యంత గోప్యంగా వెళ్లారు . అక్కడ ఉన్న సిబ్బందిని ఎవరు ఎటు కదలవద్దని ఎక్కడ వారు అక్కడే ఉండాలని ఆదేశించారు .తాము ఐటీ ,ఈడీ దర్యాప్తు సంస్థలనుంచి వచ్చామని గుర్తింపు కార్డులు చూపించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ శాఖలు తెలంగాణలో దూకుడు పెంచాయి. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల నిమిత్తం ఈడీ అధికారుల బృందాలు ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 30 బృందాలు హైదరాబాద్ తో పాటు ఖమ్మం కరీంనగర్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బీలిఫ్ ఆసుపత్రిలో ఐటీ,ఈటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 10గంటల సమయంలో డిప్యూటి కమీషనర్ ఆధ్వర్యంలో మూడు వాహనాల్లో అధికారులు వచ్చి ఒక్కసారిగా బిలీఫ్ ఆసుపత్రిలో ఐటీ అధికారులు చొరబడి మొత్తం సిబ్బందిని అలార్ట్ చేశారు. దీంతో ఐటీ అధికారులు అక్కడికి వచ్చిన రోగులను ఇబ్బందులకు గురికావోద్దని చెప్పి తనిఖీలు చేపట్టారు. కీలకంగా ఉన్న పైల్స్ ను, ఆసుపత్రికి సంబంధించిన అనుమతి పత్రాలు, ఆధాయ పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది..
ALLSO READ- ధాన్యం కొనరు కానీ ఎమ్మెల్యేలను కొంటరా?:మంత్రి పువ్వాడ
సుమారు 6గంటల పాటు బిలీఫ్ ఆసుపత్రిలోనే ఉన్న అధికారులు, వాళ్లకు కావాల్సిన అన్ని రకాల పత్రాలను తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో పాటు రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ , డాక్టర్ గురునాథరావు ఆసుపత్రిలో ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ముఖ్యంగా వాళ్ల టార్గెట్ అంతా బిలీఫ్ ఆసుపత్రిపైనే ఉన్నట్లు కనిపించింది. అక్కడే గంటల తరబడి తనిఖీలు చేశారు. పత్రాలను స్వాధీనం చేసుకుని మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
== పత్రాలు మయామైయ్యాయా..? సోషల్ మీడియాలో ప్రచారం ఎంత వరకు నిజం..?
ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగా, సిబ్బందితో కీలక పత్రాలను బిల్డింగ్ నుంచి కిందపడేసినట్లు తెలుస్తోంది.. కొన్ని పైల్స్ దాచేసినట్లు తెలుస్తోంది.ఇదే ప్రచారం సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతోంది. ఫైల్స్ ఎన్ని పడేశారు, ఎన్ని పైల్స్ దాచారనే విషయం పక్కన బెడితే అసలు ఐటీ అధికారులు అంత సమయం వారికి ఇచ్చారా.? పైల్స్ ను మాయం చేసే అంత ట్రైమ్ వాళ్లకు దొరికిందా..? అనేది మరో ప్రశ్నగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
== ఉలిక్కిపడిన ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యం
ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఈటీ, ఐటీ దాడులు జరుగుతుండటంతో ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా మూడు ఆసుపత్రుల్లో ఒకే దఫాలో దాడులు చేసి, ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తుండంతో యజమాన్యం, వైద్యులు భయాందోళనకు గురైనట్లు సమాచారం. కొంత మంది ఆసుపత్రి యజమాన్యం, వైద్యులు ఆసుపత్రిని వదిలి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐటీ అధికారుల దాడులు ఖమ్మం జిల్లా వైద్యరంగాన్నే కదిలించాయనే చెప్పాలి.