Telugu News

ఆ బాధితుల సంఘం ఆవేధన ఏంటో..?

రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్

0

డాక్యుమెంట్ ఉన్న ప్రతి ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయాలి

★★ ఫ్లాట్ లు రిజిస్ట్రేషన్ కానీ బాధితుల సంఘం

ఖమ్మంరూరల్/ఖమ్మం, జులై 25(విజయంన్యూస్)

డాక్యుమెంట్ ఉన్న ప్రతి ప్లాట్ ను రిజస్ట్రేషన్ చేపిచ్చే విధంగా మంత్రి అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఒప్పించాలని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (డాక్యుమెంట్ ఉండి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కానీ బాధితుల సంఘం) డిమాండ్ చేశారు.

Allso read:- భద్రాచలం భవిష్యత్తేమిటి?

సోమవారం  ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ2020 ఆగష్టు 20 తర్వాత కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఖమ్మం లొ చాలా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు అయితే తర్వాత ప్రభుత్వం అట్టి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేసింది దీంతో ఫ్లాట్లు కొన్నవారు సుమారు సంవత్సరం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కొంత మంది బిల్డర్లు యిల్లుకట్టి రిజిస్ట్రేషన్ కాకపోవడంవల్ల వడ్డీలకిచ్చినవారు ఇబ్బందులు పెడుతుంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖ లొ ఉన్న అధికారులు చేసిన తప్పు వల్ల ఈ రోజున ప్లాట్లు కొన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మంలో ప్రభుత్వ అధికారుల వల్ల మోసపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని అన్నారు రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి అనేకమంది అనేక రకాలుగా జీవనోపాధి పొందుతున్నారు కావున ఈ రంగంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తే అన్ని రంగాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు గతంలో ఫ్లాట్ల కొనుగోలుదారులంతా పువ్వాడ అజయ్ కుమార్ ను కలవడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పరిష్కారం చూపెట్టలేదు కావున ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మొక్క శేఖర్ గౌడ్ తాటి వెంకటేశ్వర్లు అజ్మీరా కిషోర్ నాయక్ .తుమ్మల వెంకటేశ్వర్లు. ఆవుల సత్యనారాయణ .సూరినేని మోహన్రావు .కణుదుల యుగంధర్రెడ్డి .ఎర్ర రవీందర్రెడ్డి చంద్రగిరి నగేష్ .గూడా ఉపెందర్ యార్లగడ్డ కృష్ణారావు .కొల్లు పూర్ణా మాడిశెట్టి నాగేశ్వరరావు . బాబు రెడ్డి సింగిరెడ్డి రామిరెడ్డి . గడ దాసు వెంకటేశ్వర్లు .పెండ్లి శ్రీనివాస్రెడ్డి .రవి చౌదరి తదితరులు పాల్గొన్నారు

Allso read:- అశ్వాపురంలో టీఆర్ఎస్ నేతల ఢిష్యూండిష్యూం