అరెకోడులో అక్రమంగా మట్టి తవ్వకాలు
== అధికారుల ఆదేశాలు భేఖాతర్…
== రవాణా పర్మిట్ లేకుండానే యథేచ్చగా గ్రావెల్ తరలింపు…
== ప్రశ్నించిన వారిని పర్మిషన్లు అన్నీ ఉన్నాయని దభాయింపు.
ఖమ్మం రూరల్, నవంబర్ 5(విజయంన్యూస్)
ఖమ్మం రూరల్ మండలంలో అక్రమంగా మట్టి రవాణా కొనసాగుతోంది.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా జాతీయ రహధారి నిర్మాణానికి అంటూ ఇతర ప్రాంతాలకు మట్టి రవాణా జరుగుతోంది.. ఇటీవలే ఓ గ్రామంలో మట్టి రవాణా జరుగుతుండగా, విజయం పత్రిక కథనానికి అధికారులు స్పందించి నిలిపివేసిన తిరిగి అక్కడ రవాణా జరుగుతూనే ఉంది. అలాగే ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం, అరెకోడు రెవన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు జరుగుతుంది.. ఇదేందని ఎవరైనా అడిగితే అన్ని అనుమతులు ఉన్నాయి, మీరు ఏం చేసిన మాకేం కాదు అన్నట్లు దబాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ః
ఇది కూడా చదవండి: జుజ్జులరావుపేట వెంచర్ పై అధికారుల నజర్
ఖమ్మం రూరల్ ఖమ్మం–సూర్యాపేట నేషనల్ హైవేకి ఎలాంటి పర్మిషన్లు లేకుండా యథేచ్చగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. డీఆర్ఎన్ కంపెనీకి చెందిన లారీలు పదులు సంఖ్యలో వందల ట్రిప్పులు మట్టిని ఎలాంటి పర్మిట్లు లేకుండానే విచ్చల విడిగా గ్రావెల్ను తరలిస్తున్నాయి. మండలంలోని ఆరెకోడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 393/పీ లో సుమారు రెండు హెక్టార్ల ప్రభుత్వ భూమిలో మైనింగ్ అనుమతులు తీసుకున్నారు. కాని అక్కడి నుంచి మట్టిని సూర్యాపేట రోడ్కు తరలించడానికి లారీలకు ఎలాంటి ఆన్లైన్ అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా తరలిస్తున్నారు. కొత్తగా వేసిన ఆర్అండ్బీ రహదారి ఈ తోలకాల కారణంగా గుంతలమయం అయ్యింది. మరికొద్ది రోజులు ఇదేవిధంగా లారీలు తిరిగితే ఆ రహదారి ఎందుకూ పనికి రాకుండా పోతుందని చింతపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఎంతోకాలం ఎదురు చూస్తే దహదారికి మంజూరు అయ్యిందని ఆరోడ్డును డీఆర్ఎన్ కంపెనీ పుణ్యాన శిథిలమవుతుందని ఆరోపిస్తున్నారు.
ఇది కూడ చదవండి: గంగబండతండ పంచాయతీ ట్రాక్టర్ బయట పనులకు
గతంలో పలు ప్రతికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు ఇప్పటికే గుత్తేదారులుకు చెందిన సూపర్వైజర్కు పర్మిట్లు లేకుండా ఎలాంటి తోలకాలు జరపొద్దని అలా జరిగితే లారీలు సీజ్ చేస్తామని హెచ్చరించినా గుత్తుదారు అధికారుల ఆదేశాలను భేఖాతర్ చేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేకపోవడం వలనే చింతపల్లి గ్రామస్తులకు రూ. 3 లక్షలు
ముట్టజెప్పారని అన్ని అనుమతులు ఉంటే ఎందుకు దబ్బులు ఇస్తారనేది ఇక్కడి ప్రశ్నగా మిగిలిందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సీరియస్గా తీసుకుని ఈ అక్రమ తోలకాలకు అడ్డుకట్ట వేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.