Telugu News

 బెల్లం వేణు… నీ చరిత్ర విప్పవమంటావా..?: మౌలానా

రూరల్ సీఐ పద్ధతి మార్చుకోండి: సీపీఐ నేత దండి సురేష్

0

 బెల్లం వేణు… నీ చరిత్ర విప్పవమంటావా..?

== సెటిల్మెంట్లు.. బెదిరించడమే  నీ చరిత్ర..?

== ప్రశాంత మండలంలో చిచ్చుపెడితావా..?

== నిన్ను ఎట్టి పరిస్థితుల్లో సహించం.

== టీఆర్ఎస్ నేత బెల్లం వేణుపై సీపీఐ నేత మౌలానా ఫైర్

== కేసులకు భయపడం.. పోరాటం ఆపం

== రూరల్ సీఐ పద్ధతి మార్చుకోండి: సీపీఐ నేత దండి సురేష్

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24(విజయంన్యూస్)

అధికార పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ఆయన భార్య ఎంపీపీ బెల్లం ఉమా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ఖమ్మం రూరల్ మండలాన్ని దోచుకుంటున్నాడని, సెటిల్ మెంట్లు, బెదిరింపులు, భూ దందాలు చేస్తూ దండుకుంటున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా ఆరోపించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెల్లం వేణు, ఖమ్మం రూరల్ సీఐ పై ద్వజమెత్తారు.

allso read- అధ్వానంగా పల్లె రహ ‘దారిద్ర్యం’

ప్రశాంతంగా ఉన్న  మండలంలో చిచ్చుపెడితే సహించేది లేదరని, తగిన  సమాధానం చెప్పక తప్పదని మౌలానా హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకుంటే మంచిదని, లేకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలోఉంటే ఆ పార్టీలో చేరి పబ్బం గడుపుకునే నాయకులు కమ్యూనిస్టు పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. బెల్లం వేణు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని సెటిల్మెంట్లు, బెదిరించడం రాజకీయాలు కాదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీపీఐకి ఉందన్నారు. వార్త కార్యాలయం పక్కన  ఆక్రమించిన భూమి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి ముగ్గుబొందల గుట్ట ఆక్రమణలో నీ పాత్ర ఏమిటో మండల ప్రజలకు తెలుసునన్నారు. ప్రశాంతతను కోరుకునే కమ్యూనిస్టు పార్టీ దోపిడీది, కబ్జాలకు వ్యతిరేకమన్నారు. ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నీ నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలన్నారు.  ఎదులాపురం లో ఎర్రజెండా పాలనే కొనసాగుతోందని, రాజకీయయంగా డిస్టర్ చేయడానికి  ప్రయత్నిస్తున్నారని, అందుకు గాను వ్యక్తి గత దూషణ ,వ్యక్తి గత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంతో నీకేంటి సంబంధమని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నువ్వు, కోట్లు ఎక్కడ నుంచి సంపాధించావో రూరల్ మండల ప్రజలకు తెలియదా..? అన్ని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో,వారి అవసరాలను తీర్చడానికి పోరాటం చేసిన నాయకుడు కాకుండానే, పదవులను అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్, అధికారులను, ఇతర పార్టీల నాయకులను బెదిరించడం, సందు దొరికినకాడళ్లా కట్చిఫ్ వేసి పోలీసులతో బెదిరింపులకు దిగడం ఆయన నైజమని అన్నారు. మహాకూటమి గా ఉండి ఉపేందర్ రెడ్డి ని గెలిపించినప్పుడు బెల్లం వేణు ఎక్కడున్నాడని అన్నారు. రాజకీయ, వ్యక్తిగత అవసరాలకు ఉపేందర్ రెడ్డి దగ్గర చేరాడని,

అధికార పార్టీని అడ్డం పెట్టుకుని బెల్లం వేణు  గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామాల్లో తగాదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, ఆ రాజకీయాలు శాశ్వతం కాదన్నారు.

== కేసులకు భయపడేది లేదు – పోరాటం ఆపేది లేదు : దండి

కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన తమ పోరాటాలను కూడా ఆపేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అన్నారు.  మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ.. కొంత మంది అధికారులను అడ్డం పెట్టుకుని కబ్జాకోరులను వెంటేసుకుని ముఠా నాయకునిలా వ్యవహరించే వారికి తగు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

allso read- నేలకొండపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు ఒక ముఠా నాయకునిలా వ్యవహరిస్తున్నారని, ఏదులాపురం సొసైటీని ఆయన పార్టీకి అప్పగిస్తే కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందన్నారు. దమ్ముంటే ఏదులాపురం సొసైటీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సురేష్ సవాల్ విసిరారు. గ్రీన్ బెల్ట్కు సంబంధించి అనవసర ఆరోపణలు చేశారని సీపీఐ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని వేణు అనుచరులు వ్యాపారం చేస్తున్నారని గ్రీన్ ల్యాండ్ స్థలాల గురించి తన చుట్టూ ఉన్న వారిని ప్రశ్నిస్తే మంచిదన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా వ్యక్తిగతంగా తాను కానీ తన కుటుంబం కానీ లబ్ధి పొందినట్లుగా ఉంటే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. 193 సర్వే నెంబరులో వేణుకు భూమి ఎలా వచ్చిందో చెప్పి ముక్కు నేలకు రాయాలని దండి సురేష్ డిమాండ్ చేశారు. బెల్లం వేణు చుట్టూ కబ్జాకోరులే ఉన్నారని పోలేపల్లి సర్వే నెం.156లో ఒక ప్రభుత్వ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని కొందరు గ్రానైట్ వ్యాపారం చేసుకుంటుంటే దానికి పట్టా ఎవరు ఇచ్చారని సురేష్ ప్రశ్నించారు. నీ ముఠా సభ్యులు కొందరు ఆ ప్రాంతంలో మోటార్లను ధ్వంసం చేసి బెదిరింపులకు గురి చేసింది వాస్తవం కాదా అన్నారు. సర్వే నెం. 126 లోని గురుదక్షిణ ఫౌండేషన్లో రెండు ఎకరాల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న నీ అనుచరులు కాదా అన్నారు. చింతపల్లి గ్రామంలో కుమ్మరికుంట శిఖాన్ని ఆక్రమిస్తే ఐబీ అధికారులు మీ నాయకులపై కేసు నమోదు చేసింది వాస్తవం కాదా అన్నారు. సారా బట్టీలో గుమస్తాగా పనిచేసిన వేణు గ్లాసులు కడిగిన వ్యక్తి ఎలా ఆర్థికంగా ఎదిగడాని  ఆయన డిమాండ్ చేశారు. తన ఆస్తులకు సంబంధించి ఏ చర్చకైనా సిద్ధమని రావాల్సింది బెల్లం వేణు ముఠాయే అన్నారు.

== రూరల్ సీఐ సారూ పద్ధతి మార్చుకోండి :

రూరల్ సీఐ శ్రీనివాసరావు తన పద్దతి మార్చుకోవాలని బెల్లం వేణు ప్రోద్బలంతో అక్రమ కేసులు పెడుతూ సీపీఐ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని సురేష్ ఆరోపించారు. దొంగ రాళ్ల వ్యాపారులతో  ఫోటోలకు ఫోజులిచ్చే సీఐకి ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులతో మాట్లాడేందుకు సిగ్గు అనిపిస్తుందా అని  ప్రశ్నించారు. లెప్రసీ కాలనీలో సీఐ ప్రోద్భలంతోనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని దీనిపై ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇటీవల జరిగిన కృష్ణయ్య హత్య విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమను భయపెట్టేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారన్నారు. వాళ్ళ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సీఐ పద్దతి మార్చుకోకపోతే మేమే ఆయన పద్దతి మార్చాల్సిన అవసరం వస్తుందన్నారు. ఈ  సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిడికంటి వెంకటరెడ్డి, అజ్మీర రామ్మూర్తి, జిల్లా నాయకులు పుచ్చకాయల సుధాకర్రావు, ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, పగిళ్ల వీరభద్రం, మేళ్లచెరువు లలిత, బోజడ్ల సూర్యారావు, పలువురు జిల్లా సమితి సభ్యులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల కార్యవర్గ సభ్యులు, పలువురు బెల్లం వేణు బాధితులు పాల్గొన్నారు.

allso read- ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం..?