Telugu News

తమ్మినేని క్రిష్ణయ్యను హత్యచేసిన నిందితులు అరెస్టు..రిమాండ్..?

8 మంది నిందితులను రిమాండ్ చేసిన పోలీసులు*

0

తమ్మినేని క్రిష్ణయ్యను హత్యచేసిన నిందితులు అరెస్టు..రిమాండ్..?

= 8 మంది నిందితులను రిమాండ్ చేసిన పోలీసులు*

== జడ్జిముందు ప్రవేశపెట్టిన పోలీసులు 

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 19(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా, తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని క్రిష్ణయ్య హత్య విషయంలో ఖమ్మం జిల్లా పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి పురోగతి సాధించారు. హత్యకు సంబంధించిన నింధితులను అరెస్టు చేయడమే కాకుండా అత్యంత రహస్యంగా రిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో ఖమ్మం జిల్లా జైలుకు తరలించి జడ్జిముందు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ణయ్యపై హత్యచేసిన విషయంలో ఆయన కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు, ఖమ్మం రూరల్ పోలీసులు వేగవంతంగా విచారణ చేయగా, అట్టి కేసులో 8మందిపై కేసు నమోదు చేశారు. కాగా సంఘటన జరిగిన తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన నింధితులను పోలీసులు పట్టుకుని ఖమ్మం సబ్ జైల్ కు తరలించారు. మొత్తం 8మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారందర్ని రిమాండ్ కు తరలించారు. ఏ1గా బోడపట్ల శ్రీనివాస్, ఏ2గా గజ్జిక్రిష్ణ, ఏ3గా నూకల లింగయ్య, ఏ4గా బండారు నాగేశ్వరరావు, ఏ5గా కన్నెకంటి నవీన్, ఏ6గా జక్కంపూడి క్రిష్ణ, ఏ7గా మల్లారపు లక్ష్మయ్య, ఏ8గా ఎస్.కె రంజాన్ పాషాలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.

ALLSO READ- నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నరు.. తమ్మినేని