*ఆశయమా… ఆత్మరక్షణా….?*
*సంశయంలో తమ్మినేని కృష్ణయ్య కుటుంబం…*
*తండ్రి హత్య – సొంత పార్టీ మౌనం – సిపియం దూకుడుపై ఆలోచనలో తనయుడు*
*ప్రజల మద్దతుతో ఊగిసలాట….*
✍️ *పి వి నాగిరెడ్డి* ✍️
(ఖమ్మం -విజయం న్యూస్)
నాకు చావంటే భయం లేదు… మీకందరికీ నేనున్నాను, నేను ఎలా చస్తానో తెల్వదు… నా భార్య కూడా తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడి కూతురే… ఆమె కూడా నిత్యం ప్రజలలోనే ఉంటూంది అంటూ భారత కమ్మ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కంచుకోట, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత గ్రామంలో ప్రజలకు చేరువై, ఏక చ్చత్రాదిపత్యాన్ని బద్దలు కొట్టి, ప్రజాస్వామ్య పద్దతిలొ ఎన్నికల తంతు జరిగేలా ముందుకొచ్చి, తనే ముందుండి నిలిచి గెలిచిన ధీరుడు *తమ్మినేని కృష్ణయ్య….*
Allso read- పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా
ఆధిపత్యమో, అంతులేని కసో, ప్రజల అభిమానమో, బీటలు వారుతున్న కోటల సాక్షిగా తమ్మినేని కృష్ణయ్య అత్యంత పాశవికంగా చంపబడ్డాడు… అయన తస్మధీయులకు ఎధురొడ్డి, మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడిగా, ఒక్క తెల్దారుపల్లే కాదు, తన గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాలకు బాసటగా, నియోజకవర్గంలోనే అతి పెద్ద మండలం గా ఉన్న రూరల్ లో ప్రత్యర్ధులకు బలమైన నాయకుడిగా ఎదిగిన కృష్ణయ్య హత్యతో ఓ రకంగా తెల్దారుపల్లే, కాదు తనను ప్రోత్సహించిన నాయకునికి, తనను నమ్మిన ప్రజలకు తీరని వేదననే మిగిల్చింది…
అయితే తమ్మినేని కృష్ణయ్య హత్య అనంతర పరిణామాలు ఎలా ఉన్నాయి, తెల్దారుపల్లి ప్రజల ఆలోచనలో మార్పు వస్తాదా, ఇప్పటిదాకా ఆ గ్రామానికి అండగా ఉన్న ఆకుటుంబం ఏమి ఆలోచిస్తుంది, దారుణ హత్యపై *పెదవి దాటని సొంత పార్టీ మాటలు ఇప్పుడు కౌగిలి చేసి వెన్ను తట్టి అభయం ఇస్తున్నారా* అంటే గత వారం రోజుల పరిణామాలు కాస్త ఆదిశ గానే కన్పడుతున్నాయి…
allso read- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్
వాస్తవంగా తమ్మినేని కృష్ణయ్య హత్య అనంతర పరిణామాలో సిపియం నాయకుల ఇళ్ళపై భీకర దాడులే జరిగాయి..ఎన్నడూ ఆ గ్రామంలో వారి ఇళ్ళవైపు కన్నే ఎత్తి కూడా చూడని ప్రజలు ఏకంగా గేట్లను బద్దలు కొట్టి, ఇంటిని ధ్వంసం చేయటం కూడా ఓ సాహసమే… అదంతా గ్రామంలో కృష్ణయ్య మీద ఉన్న అభిమానమని మనం అనుకుంటే, సిపియం పార్టీ మాత్రం లేదు లేదు మా నేతల ఇళ్ళపై దాడులు చేసింది గ్రామస్థులు కాదు, బయట నుండి వచ్చిన మూకలు మాత్రమే అని చెప్పుకొచ్చారు…
ఇదంతా ఒక ఎత్తైతే హత్య అనంతర పరిణామాలలో నిందితులు పారిపోవటం, పోలీసులు పది మందిపై కేసు నమోదు చేయటం, నాటకీయ పరిణామాలలో 8మంది నిందితులను కోర్టులో హాజరు పర్చటం, మరో ఇద్దరు ప్రధాన నిందితులను పట్టులేకపోవటం, వారే స్వయంగా కోర్టులో లొంగిపోవటం తో హత్య విషయంలో పోలీసుల పాత్రపై కూడా ప్రజలలో కొంత అనుమానాలు వచ్చాయి… అయితే మొత్తం మీద ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ పోలీసులు కోర్టుకు సమర్పించిన దర్యాప్తు, రిమాండ్ రిపోర్ట్ లో తమ్మినేని కృష్ణయ్య హత్యకు సూత్రధారులు, పాత్రధారులను తేల్చేయటంతో కాస్త కేసు పక్కదోవ పట్టలేదనే నిర్ణయానికి వచ్చారు ఆయన అభిమానులు, ప్రజలు…
ఇక్కడి దాకా ఒకలా అయితే రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు, మునుగోడు ఉపఎన్నిక నేపధ్యం, భాజాపా వ్యూహాత్మక రాజకీయాలు, వామపక్షాల పొత్తుల ఆవశ్యకత, అన్నింటికి మించి తెరాస నేతలలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు తప్ప ఎవ్వరూ హత్యను బాహటంగా ఖండించక పోవటం, సిపియం పార్టీ కూడా జిల్లా స్థాయిలో హత్యను ఖండించి, తమ నేతల, కార్యకర్తల ప్రమేయం లేదంటూనే గ్రామంలో కవాతు నిర్వహించినంత పని చేయటం, ఆ కార్యక్రమానికి పోలీసుల మౌఖిక మద్దతు తో ఇప్పుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబం ప్రజల మద్దతు లభిస్తున్నా ఓ రకమైన ఆత్మరక్షణలో పడిపోయిందా అనేది స్పష్టం కావట్లేదు… గ్రామంలో, మండలంలో, జిల్లా, రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులు చోటు చేసుకోవటం, మునుగోడు వరకే మాదోస్తీ అని పైకి చెపుతున్నా, రానున్న అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలలో కూడా సిపియం కేసిఆర్ తో దోస్తీ కడుతుందనే నేపద్యం, అంతకు మించి పొత్తులలో భాగంగా పాలేరు సీటు సిపియం కే కేటాయిస్తారనే వార్తలు, అంతే కాకుండా ఆ పార్టీ అగ్రనేతే పోటీ చేస్తారనే సమాచారపు లీకులు, గత కొంతకాలంగా పాలేరు నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాల ప్రణాళిక వెరసి తమ్మినేని కృష్ణయ్య కేసు ఏ మలుపు తిరిగుతుందోననే సంశయంలో ఆయన కుటుంబం ఉన్నట్లు తెలుస్తుంది…
Allso read- తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి
దీంతో ఆయన తనయుడు తండ్రి ఆశయాలు, తమను వెన్నంటి ఉన్న ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని తనకు, తన వారికి, తన ప్రజలకు రక్షణ కోరుకుంటున్నారా అంటే కాదనలేని నిజమే అనిపిస్తుంది…దీనికి కొనసాగింపుగా ఎంతో మంది స్వపక్ష, విపక్ష నేతలు ఇంటికే వచ్చి అభయం ఇస్తున్న కూడా గత శుక్రవారం ఓ జిల్లా స్థాయి మండల పదవి వున్న నాయకుని గ్రామంలో, మండల నాయకుల సమక్షంలో ఎమ్నెల్యే కందాలను కలవటం, అదికూడా అదే సమయంలోనే కేసు పురోగతి, తమ రక్షణ పై ఖమ్మం పోలీసు కమీషనర్ ను కలిసేందుకు సమయం కోరి కూడా ఆయన్ను కలవకుండా ఉండటం చూస్తుంటే వారి ఆలోచనలలో మార్పు వచ్చినట్లే కనపడుతుంది.. అయితే హత్య అనంతర పరిణామాలు, బిజెపి సిబిఐ దర్యాప్తు కోరడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శ పర్యటన షెడ్యూల్ విడుదల చేయటం తో, రాజకీయ ప్రాధాన్యత పెరగటంతోనే టీఆరెస్ ఒక్క అడుగు ముందుకేసి తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని ఓదార్చే పనిలో పడినట్లు, ఇప్పటిదాకా నోరు మెదపని నాయకులు కేసులలో ఇరుక్కున కృష్ణయ్య అనుచరులను రక్షిస్తామని, అండగా ఉంటామని నమ్మపలికినట్లు, తమవారిని బయట పడేసేందుకే అధికార పార్టీ నేతలను కలిసినట్లు, తమ భద్రత, నిందితులకు శిక్షలు పడే విధంగా తాము కృషి చేస్తామని, యువ నాయకుడు కేటీఆర్ లేదా కుదిరితే సియం కేసీఆర్ ను కూడా కలిపిస్తామని అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది… ఇదే విషయమై తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ ను అడగ్గా నేను కలిసిన మాట వాస్తవమే అని చెప్పటం, కొన్ని అవసరాల రిత్యా తప్పలేదని స్పష్టం చేయటం వెరసి కృష్ణయ్య కుటుంబం ప్రజల బాగోగులు, తమ ఉజ్వల భవిష్యత్తు పైనే దృష్టి మరల్చిందని చెప్పవచ్చు…
Allso read- తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు
కాని ఇది తన నిర్ణయమేనా, తన తల్లి, కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం కూడానా అనేది తెలియాల్సి ఉంది. అంతే కాదు తమ్మినేని కృష్ణయ్య అభిమానులు, ఆ గ్రామ ప్రజల స్పందన, ప్రతి చర్య ఎలా ఉండనుంది అనేది తెల్సేందుకు మరో రెండు మూడు నెలలు ఆగాల్సిందే…