పాడే మోసిన తుమ్మల
== తరలివచ్చిన వేలాదిజనం
== భారీ బందోబస్తు నడుమ అంతిమయాత్ర
ఖమ్మంరూరల్, ఆగస్టు 16(విజయంన్యూస్)
అభిమానమంటే ఇది.. ఎంత మంచోడైతే ఇంత జనం వస్తారు.. ఒక్కరా..ఇద్దరా..? వేలాధి మంది అంతిమ యాత్రకు తరలిరావడంతో ఆ ఊరు జనసందోహమైంది.. వేలాధి మంది జనఅభిమానం నడుమ అంతిమయాత్ర జరిగింది. ఆయన అత్యంత ప్రియమైన నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుడి మరణంతో దిగ్ర్భాంతికి గురైయ్యాడు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోశాడు.. అంతిమయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన వెనువెంట ఉండి ఆయన ప్రధాన అనుచరుడికి నివాళ్లు అర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్యను దుండగులు హత్య చేసిన సంగతి పాఠకులకు తెలిసింది. అత్యంత కిరాతంగా ఆయన్ను తల్వార్లతో దాడి చేసి హత్యచేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న వేలాధి మంది జనం ఆయన స్వగ్రామమైన తెల్దారుపల్లి గ్రామానికి చేరుకుని సంఘటనను చూసి కన్నీరుమున్నీరైయ్యారు.
allso read- టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య..ఎందుకోసమంటే..?
తమ్మినేని క్రిష్ణయ్య మరణంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన ప్రత్యర్థి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు అందుకు కారణమని భావించిన గ్రామస్థులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిని ద్వంసం చేశారు. ఆయన గ్రానైట్ ప్యాక్టరీని ద్వంసం చేశారు. జేసీబీని తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణమే గ్రామంలో 144 సెక్షన్ విధించారు. వేలాధి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ స్వయంగా గ్రామంలో పర్యటిస్తూ కవాత్తు చేశారు. దీంతో ఆ గ్రామంలో టెన్షన్..టెన్షన్ నెలకొంది.
== అంతిమయాత్రకు వేలాధిగా తరలివచ్చిన జనం
తమ్మినేని క్రిష్ణయ్య అంతిమయాత్ర అత్యంత జనసందోహం నడుమ కొనసాగింది. క్రిష్ణయ్య స్వగ్రామమైన తెల్దారుపల్లి గ్రామంలో అంతిమయాత్రను భారీబందోబస్తు నడుమ కొనసాగింది. ఈ అంతిమయాత్రకు ఖమ్మం రూరల్ మండలంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వేలాధిమంది జనం తరలివచ్చారు. దీంతో కిలోమీటర్ల కొద్ది అంతిమయాత్ర కొనసాగింది.
allso read- రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం
== పాడే మోసిన తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుడైన తమ్మినేని క్రిష్ణయ్య పాడే మోశారు. సీపీఎం పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేస్తున్న సమయంలో తమ్మినేని క్రిష్ణయ్య సీపీఎం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో తుమ్మల సమక్షంలో చేరారు. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా పనిచేస్తున్నారు. తుమ్మలకు బాగా నమ్మిన బంటువు అని కూడా అంటారు. అలాంటి తమ్మినేని క్రిష్ణయ్య చనిపోవడంతో దిగ్ర్భాంతికి గురైన ఆయన.. మంగళవారం తెల్దారుపల్లి గ్రామంలో జరిగిన అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. తమ్మినేని క్రిష్ణయ్య పాడే మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్ అంతిమయాత్రలో పాల్గొని చితి వద్ద పూలు ఉంచి నివాళ్లు అర్పించారు. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అంతిమయాత్ర అయిపోయే వరకు వందలాధి మంది పోలీసులు ఆ గ్రామంలో కవాత్తు చేస్తూ 144 సెక్షన్ అమలు చేస్తూ వీధికోక పోలీసుల చొప్పున బందోబస్తు నిర్వహిస్తున్నారు.