Telugu News

తమ్మినేకి కృష్ణయ్య హత్యకేసులో నిందితులకు షాక్

బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఖమ్మం కోర్టు

0

తమ్మినేకి కృష్ణయ్య హత్యకేసులో నిందితులకు షాక్

== బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఖమ్మం కోర్టు

== తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పోన్లో పరామర్శించిన బీజేపీ నేత బండి సంజీయ్

ఖమ్మంరూరల్, సెప్టెంబర్ 12(విజయంన్యూస్)

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టిఆర్ఎస్ నేత కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు ఖమ్మం కోర్టు షాక్ నిచ్చింది. బెయిల్ కోసం నిందితులు ఖమ్మం కోర్టులో పిటీషన్ వేయగా, ఆ బెయిల్ పిటీషన్ ను ఖమ్మం కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: ఆశయమా… ఆత్మరక్షణా..

ఆగస్టు 15వ తేదీన తెల్దారపల్లిలో దారుణ హత్యకు గురైన కృష్ణయ్య కేసు లో 10 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కృష్ణయ్య హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు కీలక వ్యక్తులు నేరుగా కోర్టులో లొంగిపోయారు. అయితే అనుమానితులుగా అరెస్టు చేసిన పోలీసులు సబ్ జైలుకు పంపించారు. కాగా సోమవారం బెయిల్ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ ను ఖమ్మం కోర్టు తిరస్కరించింది. మరికొద్ది రోజుల పాటు రిమాండ్ లో ఉండాలని కోర్టు నిర్ణయించింది. దీంతో కొందరు ఆసలు అవిరైయ్యాయి.

== కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ 

హత్యకు గురైన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన చేసి మాట్లారు. కృష్ణయ్య కుమారుడు నవీన్ ను ఫోన్లో పరామర్శించిన బండి సంజయ్..పార్టీలకతీతంగా కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామినిచ్చారు. పాదయాత్ర ముగిసిన తరువాత ఖమ్మం వస్తానని చెప్పిన సంజయ్, తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: క్షీరమా…కాలకోట విషమా..?