తెల్దారుపల్లిలో నేడు తమ్మినేని కృష్ణయ్య దశదినకర్మ
== భారీగా పోలీస్ బందోబస్తు
== పెద్దసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం
ఖమ్మంరూరల్/కూసుమంచి,ఆగస్టు 25(విజయంన్యూస్)
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య అందరికి తెలిసిందే.అయితే ఆయన దశదినకర్మ కార్యక్రమం గురువారం ఆయన స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామంలో జరిపేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామస్థులు, బందువులు అందరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా దశదిన కర్మకార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ నాయకులు భోజన వసతి కార్యక్రమాలను చూస్తున్నారు. అయితే ఈ దశదిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన వర్గీయులు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ స్థలాన్ని పరిశీలించగా, తుమ్మల వర్గీయులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు నివాళ్లు అర్పించేందుకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది.. ఇక తెల్దారుపల్లి గ్రామంలో మాత్రం ఇంకా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏసీపీ, సీఐలు, ఎస్ఐలతో పాటు ప్రత్యేక పోర్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
allso read- బండి సంజయ్ కి పిచ్చిలేసింది