Telugu News

తెల్దారుపల్లిలో ఆగని ఆందోళనలు

సీపీఎం నేతలను రానిచ్చేది లేదని గ్రామస్థుల రాస్తారోకో

0

తెల్దారుపల్లిలో ఆగని ఆందోళనలు

== కొనసాగుతున్న ఉత్కంఠ

== సీపీఎం నేతలను రానిచ్చేది లేదని గ్రామస్థుల రాస్తారోకో

==  రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు..

== పోలీసులుగ్రామస్తులకు వాగ్వివాదం

== పోలీసుల హామితో  తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసిన వివాదం

== కొనసాగుతున్న 144 సెక్షన్

 ఖమ్మం రూరల్సెప్టెంబర్ 1 (విజయంన్యూస్):

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏ క్షణానా ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్న తరుణంలో గురువారం టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, ఇటీవలే హత్యకాబడిన తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం పార్టీ నాయకులు గ్రామంలోకి వస్తున్నారనే సమాచారం అందుకున్న తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు తెల్దారుపల్లిలో ర్యాలీ నిర్వహించారు.

allso read= పాలేరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం

దీంతో సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు తక్షణమే తెల్దారుపల్లి గ్రామానికి చేరుకుని ర్యాలీ నిర్వహిస్తున్న తమ్మినేని కృష్ణయ్య కుటుంబంతో మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీమంత్రి తుమ్మల నా గేశ్వరరావు అనుచరుడుసోసైటి డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య ఆగస్టు 15న సిపిఎం నాయకుల చేతిలో హత్య గురైన విషయం విధితమే. అప్పటి నుంచి తెల్దారుపల్లి గ్రామం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. సూత్రధారులుగా అనుమానిస్తున్న తమ్మినేని కోటేశ్వరరావుఎల్లంపల్లి నాగయ్య పరారీలో ఉండటంపై ప్రజల్లో ఆవేషాలు పెల్లుబికుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సిపిఎం బృందం గ్రామంలోకి వస్తున్నారన్న విషయం తెలియడంతో వారిని అడ్డుకునేందుకు టిఆర్ఎస్ నాయకులుమహిళలుగ్రామస్తులు పెద్దసంఖ్యలో కృష్ణయ్య ఇంటివద్దకు చేరుకొనిఅక్కడి నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలు దేరారు.  ఖమ్మం – హైదారాబాద్ జాతీయ రహదారి పై రాస్తారోకో చేసేందుకు వెళ్తుండగా, ఊరు సరిహద్దుల్లోనే ఏసిపి బస్వారెడ్డి పోలీసులతో కలిసి అడ్డగించి ర్యాలీలకు అనుమతి లేదని ఆందోళనకారులకు తెలిపి ఘర్షణ పరిస్థితులకు పాల్పడవద్దనిసంయమనం పాటించాలని కోరారు. దీంతో కోపోద్రిక్తులై ఉన్న తమ్మినేని కృష్ణయ్య మద్దతుదారులు,  గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. హత్యచేసిన వారిని వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి అంటూ మంచి మనిషి, తమ అభిమాన నాయకుడిని అతి  కిరాతకంగా హత్య చేసినప్పుడు ఎక్కడ ఉన్నారూ పోలీసులంటూ నిలదీశారు. హంతకులను అరెస్టు చేయకుండా సిపిఎం పార్టీ  నాయకులను గ్రామంలోకి రానిచ్చేదేలేదని ఆందోళన చేశారు. దీంతో ఓ దశలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా  ఏసిపి బస్వారెడ్డి మాట్లాడుతూ.. సిపిఎం నాయకులను గ్రామంలోకి అనుమతించబోమని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతోపాటు నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టానికి అప్పగిస్తామనడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

allso read- అనుచరుడికోసం రోజంతా తెల్దారుపల్లిలో తుమ్మల

– తమ్మినేని కుటుంబాన్ని రానివ్వం : కుమారుడు తమ్మినేని నవీన్, కుమార్తె రజిత

 తమ్మినేని వీరభద్రం కుటుంబంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన తండ్రి కృష్ణయ్యను తమ్ముడు అని పిలుస్తూనే కనీసం అంటూ కూడా పట్టరా..అని ప్రశ్నించారు. ఏ రాజకీయ అస్తిత్వం కోల్పోతున్నామని తన తండ్రిని హత్య చేయించారో ఆ రాజకీయాన్ని వారికి దక్కనివ్వమని,  రాబోయే ఎన్నికల్లో వారికి ఒక్క ఓటు కూడా రానివ్వకుండా ప్రజలంతా ఐక్యంగా నిలబడాలన్నారు. రూరల్ మండలంలో సిపిఎం పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాననితన తండ్రి మరణం రోజే తన ప్రాణంపై ఆశను వదిలేశామన్నారు. తనకు శత్రువులు తమ్మినేని వీరభద్రంతమ్మినేని కోటేశ్వరరావు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం నాయకులను గ్రామంలో అడుగు పెట్టనివ్వబోమని, గ్రామంలో జరుగుతున్న అలజడులపై సమాచారం ఇచ్చేందుకు పోలీసులకు ఫోన్ చేస్తే ఎత్తడం లే దనికేవలం ప్రజల బలంతోనే తమ కుటుంబం గ్రామంలో ఉంటుందని ఆవేదన పూరితంగా సంభాషించారు.

== నాన్న మరణం వీర మరణమే…మీ కోసం నా ప్రాణాన్నై అర్పిస్తా : నవీన్ 

మా నాన్న తమ్మినేని క్రిష్ణయ్య మరణం వీర మరణమనిఅటువంటి మహానాయకుడు ఆశయాలు సాధించేందుకు నేను మీ ముందకు వస్తానని తమ్మినేని క్రిష్ణయ్య కుమారుడు తమ్మినేని నవీన్ అన్నారు. ప్రస్తుత తురణంలో ఎవరు మమ్మల్ని అదుకునే  పరిస్థితిలేదని, అయినే సరే మీ కోసం నా ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, సీపీఎం పార్టీ ఇంకా సమాధుల్లోనే ఉందనినేను ఆయన వారుసుడిగా మీ ముందకు వస్తున్నాననివీళ్ల కోసం వెనక్కి తగ్గేదిలేదని సంచలన కామెంట్స్ చేశారు. సీపీఎం పార్టీ ఇంకా సమాధుల్లోనే ఉందనిబయటకు వస్తే శవాలే వస్తాయని,  వాళ్ల ఈ సారి వార్డు మెంబర్ కూడ గెలుచుకునే అవకాశం లేదని తన మధ్దుతుదారుల్లో ఆయన ధైర్యం నింపారు.  నా ప్రధాన శత్రువలు తమ్మినేని కోటేశ్వరరావువీరభద్రంలే అన్నారు.  వారు గ్రామంలోకి వచ్చే ప్రసక్తేలేదన్నారు. హత్యకు గల కారకులను వదిలేసి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పైమద్ధతుదారుల పై పోలీసులు అణిచివేయాలనుకోవడం అవివేకం అన్నారు.