Telugu News

ఖమ్మం రూరల్ మండలంలో కలెక్టర్ పర్యటన

== ఎవెన్యూ ప్లాంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు

0

ఖమ్మం రూరల్ మండలంలో కలెక్టర్ పర్యటన
== ఎవెన్యూ ప్లాంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు
== తెల్దారుపల్లి, గుర్రాలపాడు, పెద్దతండా, కస్తూర్భాగాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

(ఖమ్మంరూరల్, కూసుమంచి-విజయంన్యూస్);-

బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలను యోగ్యమైన స్థలాలుగా చేసి త్వరితగతిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని తెల్దారుపల్లి, గుర్రాలపాడు, పెద్దతండా గ్రామాల్లో పర్యటించారు. కస్తూర్భాగాంధీ పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ముందుగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ తణిఖీ చేసారు. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రభుత్వ స్థలంలో గుట్టలు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసి, మొక్కలు నాటేందుకు అనువుగా ఉండే విధంగా సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

also read :=కష్టాల్లో కార్యదర్శి!…

ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణ సక్రమంగా ఉండాలని, ఫెన్సింగ్, నీటి వసతి ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరితహారం కింద ప్రధాన రహదారితో పాటు, అంతర్గత రహదారుల వెంట ఎవన్యూ ప్లాంటేషన్ జరగలేదని ఇట్టి నిర్లక్ష్యానికి,
జాప్యానికి బాధ్యులైన మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కొరకు కనీసం 8 అడుగుల మొక్కలను నాటాలని, వాటికి సంరక్షణ వలయాలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీ ద్వారా నీటి సదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో, ఎవెన్యూ ప్లాంటేషన్లో మండల,
గ్రామ స్థాయి అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు. తెల్గారుపల్లి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంకనూ చదును చేయాల్సిన గుట్ట ప్రాంతాన్ని మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా గుట్ట చదును చేసే పనులు చేపట్టి బృహత్ పల్లె ప్రకృతి వనం పూర్తి స్థాయిలో ఏర్పాటు అయ్యే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 గుర్రాలపాడు, పెద్దతండాలో పర్యటించిన కలెక్టర్
వైకుంఠధామాల పెండింగ్ పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం, గుర్రాల పాడు, పెద్దతండా వైకుంఠధామాల పనులను కలెక్టర్ తణిఖీ చేసారు. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల వైకుంఠధామాలను ఏర్పాటు చేసుకున్నామని, రూరల్ మండలంలోనే ఇంకనూ నాలుగు వైకుంఠధామాల పనులు పెండింగ్ లో ఉన్నాయని, పెద్దతండా, ఏదులాపురం, గుర్రాలపాడు, గుదిమళ్ళ వైకుంఠధామాలను జనవరి నెలాఖరులోగా అన్ని వసతులతో పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలలో నీటి, విద్యుచ్ఛక్తి, ఇతర వసతులతో పూర్తి స్థాయిలో పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

also read :-మాస్క్ లేదా.. పైన్ కట్టు.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీలు

 

%% కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

15- 18 సంవత్సరాల విద్యార్థులు నిర్భయంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు. 15-18 సంవత్సరాల వారికి జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం ఖమ్మం రూరల్ కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా తమతో పాటు తోటి వారు కూడా సురక్షితంగా ఉంటారని, ప్రస్తుతం కోవాక్సిన్ టీకా ఇస్తున్నారని, టీకా వల్ల ఎటువంటి దుత్ప్రభావం ఉండదని, భయబ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా టీకా తీసుకోవాలని విద్యార్థినులకు కలెక్టర్ భరోసా కల్పించారు. ప్రస్తుతం మొదటి డోసు టీకా తీసుకుంటున్న విద్యార్థినులు అందరూ 28 రోజుల అనంతరం తప్పనిసరిగా రెండవ డోసు టీకా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 8 నుండి 16 వ తేదీ వరకు సెలవుల్లో ఇండ్లకు వెళ్తున్న నేపథ్యంలో తమ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్-19 టీకా వేసుకునేలా తల్లి దండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి టీకాలు వేయించాలని కలెక్టర్ తెలిపారు. కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయంలో 177 మంది విద్యార్థినీలు టీకాకు అర్హులు కాగా వారందరికి కూడా టీకా వేస్తున్నట్లు డాక్టర్ శ్రీదేవీ, ప్రిన్సిపల్ అసియాబేగం కలెక్టర్ కు వివరించారు.

also read :-వ్య‌వ‌సాయ అభివృద్ధిలో గోదాముల పాత్ర కీల‌కం : ఖమ్మం ఎంపీ నామా

అనంతరం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థినుల వసతి, భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యాలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కలను తొలగించాలని, నీటి నిల్వ లేకుండా పరిశుభ్రత పనులను వెంటనే చేపట్టాలని, అపరిశుభ్ర వాతావరణం వల్ల సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని, ముందస్తు నియంత్రణ చర్యల ద్వారా విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని విద్యాలయ ప్రిన్సిపల్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. ఆప్పారావు, ఇంచార్జ్ తహశీల్దారు కరుణశ్రీ, ఎం.పి.డి.ఓ శ్రీనివాస్ రావు, ఎం.పి.పి బెల్లం ఉమా, మైనింగ్ శాఖ ఏ.డి సంజయ్ కుమార్, ఇంచార్జ్ తహాశీల్దారు కరుణశ్రీ, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, సర్పంచ్ కోటయ్య, ఎం.పి.టి.సి మంగతాయారు, ఎం.పి.పి ఉమ, గ్రామ కార్యదర్శి రాధ, ఎం.పి.ఓ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.