Telugu News

కాంగ్రెస్ గూటికి రామూర్తినాయక్ దంపతులు

నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

0

కాంగ్రెస్ గూటికి రామూర్తినాయక్ దంపతులు

◆◆ నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

◆◆ 200 కార్లతో బారీ ర్యాలీ

◆◆ ఖమ్మం రూరల్ మండలంలో గులాబీపార్టీకి షాక్

కూసుమంచి, జూన్ 27(విజయం న్యూస్)
ఖమ్మం రూరల్ మండలం టిఆర్ఎస్ పార్టీ కి సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, మాజీ జెడ్పిటిసి భారతి దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సోమవారం గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Also read:- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ

ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సుమారు రెండు వందల కార్లతో భారీ ర్యాలీ తో హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం నుంచి ఈ కార్ల ర్యాలీ ప్రారంభించనున్నట్టు మాజీ కార్పొరేటర్ రామూర్తినాయక్ విజయం పత్రిక ప్రతినిధి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అనేక విధాలుగా టీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహిస్తుండటంతో వారు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, అలాంటి వ్యక్తులతో పని చేసే దానికంటే పార్టీ మారడం మంచిదని ఆలోచించి కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలం లో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరినీ కలుపుకొని పని చేస్తామని హామీ ఇచ్చారు.