Telugu News

డ్యాన్స్ వేసిన కలెక్టర్, సీపీ

ఆ పాటకు ముగ్థులైన జిల్లా బాస్ లు

0

డ్యాన్స్ వేసిన కలెక్టర్, సీపీ

== ఆ పాటకు ముగ్థులైన జిల్లా బాస్ లు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఇద్దరు జిల్లా బాస్ లే.. వారే ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్.. మరోకరు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్.. వీరిద్దరు ఓ పంక్షన్ లో యమ సందడి చేశారు..సింగర్ తో కలిసి డ్యాన్స్ చేశారు.. యువతను అకర్షించారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..?

ఇది కూడా చదవండి: నవ్వుల వర్షం కురిపించి హైపర్ అది

ఖమ్మం నగరంలో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కార్యక్రమంను ఖమ్మం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మూడవ రోజు సాంస్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా, రాత్రి సమయంలో ఖమ్మం నగరంలోని సర్థార్ పటేల్ స్టేడియంలో ‘ఖమ్మం సంబరాలు’ పేరుతో ఈవేంట్ చేశారు. ఈ కార్యక్రమానికి సినియాక్టర్లు, కమిడియన్స్, సింగర్స్ హాజరైయ్యారు. కాగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్  దంపతులు హాజరు కాగా వారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో సింగర్ సింహ టీమ్ పాటలతో అలరించారు. అద్భుతమైన పాటలతో యువతను ఊర్రూతలూగించారు. సింగర్ సింహ పాట పాడుకుంటూ కలెక్టర్, సీపీల వద్దకు వచ్చి డ్యాన్స్ ఫ్లీజ్ అని రిక్వస్ట్ చేయడంతోనే తక్షణమే స్పందించిన కలెక్టర్, సీపీ ఆయన పాటకు స్టేప్పులేశారు. వారు డ్యాన్స్ లు చేసి అలరించగా, యువతకు వారిని అనుకరించి డ్యాన్స్ లు చేశారు. దీంతో ఖమ్మం సంబరాలు ఆదుర్శ్ అనిపించాయి. కమిడీయన్, జబర్థస్త్ ఫేమ్ హైపర్ అది  చేసిన కామేడికి జనాలు పడిపడి నవ్వారు. ఆయన జోక్ ల పంచులతో నవ్వులు పువ్వుల వర్షం కురిసినట్లైంది.. మొత్తానికి ఖమ్మం సంబరాలు సూపర్ సక్సెస్ అయ్యింది.

ఖమ్మం నగర అభివృద్దే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ