మేము నాటాం..మీరు నాటండి..
== పెద్దలకు చాలెంజ్ విసిరిన చిన్నారులు
== మొక్కలతోనే మానవ మనుగుడ అంటున్నవిద్యార్థులు
== అందరికి ఆదర్శంగా ‘స్మార్ట్ కిడ్జ్’ విద్యార్థుల హరితహారం
ఖమ్మం,జులై 29(విజయంన్యూస్)
మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి.. కాలుష్యాన్ని నివారిస్తాయి.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యం అందుకే మేము మొక్కలు నాటాం.. మీరు నాటండి అంటూ ‘స్మార్ట్ కిడ్జ్’ పాఠశాల విద్యార్థులు పెద్దలకు చాలెంజ్ విసిరారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఖమ్మం నగరంలోని “స్మార్ట్ కిడ్జ్ పాఠశాల” చిన్నారులు పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలలో భాగంగా “గ్రీన్ డే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు గ్రీన్ దుస్తులను ధరించి ప్రతి ఒక్క విద్యార్థి తమ ఇంటి వద్ద నుండి ఒక మొక్కను తీసుకొచ్చి పాఠశాలలో మానవహారంగా ఏర్పడి ఆ మొక్కలను పాఠశాల ఆవరణంలో నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను అదేవిధంగా ఆకుపచ్చటి రంగులతో హరితహారం మొక్కల యొక్క చిత్రాలను ముగ్గుల రూపంలో వేసి అలరించారు.
allso read- మంత్రి సత్యవతి రాథోడ్ కు మాతృ వియోగం..
ప్లకడ్లను ప్రదర్శిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. మొక్కలు పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షించగలమని ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటి వాటినే సంరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ పిల్లలకు చిరుప్రాయం నుండే “పర్యావరణ పరిరక్షణ” బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన ఉపాధ్యాయుల పైన ఉందని,చెట్లను పెంచడం ద్వారా అవి మానవాళికి జీవనాధారం అని, వాటి ద్వారా పర్యావరణాన్ని దాని సమతుల్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, పర్యావరణం దెబ్బతింటే ఆ ప్రభావం మనుషుల జీవితాల మీద ఆరోగ్యం మీద చుట్టూ పరిసరాల మీద పడే అవకాశం ఉందని కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకొని మొక్కలను పెంచుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండగలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య పాఠశాలకు ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.