Telugu News

త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?

వాహనాలకు అనుమతినిచ్చిన నేషనల్ హైవే అథారటి అధికారులు

0

త్వరలో  నేషనల్ హైవే ప్రారంభం

== అక్కడక్కడ మినహా పూర్తైన రోడ్డు నిర్మాణ పనులు

== వాహనాలకు అనుమతినిచ్చిన నేషనల్ హైవే అథారటి అధికారులు

== అద్భుతంగా నేషనల్ హైవే నిర్మాణం

== పురోగతిలో ఖమ్మం-కోదాడ హైవే పనులు

== త్వరలో ఖమ్మం నుంచి దేవరపల్లి పనులు ప్రారంభం

== ముమ్మరంగా ఖమ్మం ట కురవి రహదారికి భూసేకరణ

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 23(విజయంన్యూస్)

ఖమ్మం టూ సూర్యపేట జాతీయ రహధారి పనులు పూర్తైయ్యాయి.. అక్కడక్కడ కొన్ని పనులు మినహా రోడ్డు పూర్తిగా నిర్మాణం జరిగింది.. ఇప్పటికే ఆరోడ్డులో చెకింగ్ కోసం వాహనాలకు అనుమతిని ఇవ్వగా, అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఎన్ హెచ్ఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రితో రహదారిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో ఖమ్మం జిల్లా ప్రజల 20ఏళ్ల కల సాకారం కానుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే  ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో అభివద్ది పెరిగింది..

allso read- అధ్వానంగా పల్లె రహ ‘దారిద్ర్యం’

బిజినెస్ ఫరంగా ముందు అడుగువేసింది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం హైదరాబాద్ లాంటి మహానగరంతో పోటీ పడుతుంది.. ఈ దశలో జాతీయ రహదారి ఖమ్మం నగరానికి అవసరమని భావించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మం టూ సూర్యపేటకు నేషనల్ హైవే నిర్మాణం కోసం ప్రతిపాధనలు చేసింది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఆర్అండ్ బీ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మొదటి సారిగా జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాధనలు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో మంత్రిగా పనిచేసిన సంభాని చంద్రశేఖర్ ఆ రోడ్డు నిర్మాణం కోసం మరోసారి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రతిపాధనలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినట్లే చేసి నిధుల మంజూరు నిలిపివేసింది. దీంతో ఆ రోడ్డు కల అలాగే మిగిలిపోయింది. కాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు 2015 సంవత్సరంలో పట్టుబట్టి సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఖమ్మం జిల్లాకు నాలుగు నేషనల్ హైవే రోడ్లను మంజూరు చేయించారు. ఖమ్మం టూ సూర్యపేట, ఖమ్మం టూ దేవరపల్లి, ఖమ్మం టూ కోదాడ, ఖమ్మంటూ కురవి, ఖమ్మం టూ వరంగల్ జిల్లాలకు అనుబంధంగా జాతీయ రహదారిలను ఆనాటి కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కారి తో చర్చలు జరిపి మంజూరు చేశారు. దీంతో ముందుగా 2016 సంవత్సరంలో ఖమ్మం టూ సూర్యపేట, ఖమ్మం టూ దేవరపల్లి, ఖమ్మం టూ కోదాడ రహదారి పనులకు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కారి శంకుస్థాపన చేశారు.  

allso read- ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?

అనంతరం ప్రారంభమైన భూసేకరణ, నిర్మాణ పనులు అత్యంత వేగవంతంగా జరిగాయి. 2017 నుంచి ప్రారంభమైన నిర్మాణ పనులు 2019 వరకు కొంత జాప్యంగా పనులు జరిగినప్పటికి ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలు జాతీయ రహదారి నిర్మాణ పనులపై పర్యవేక్షణ చేశారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనులు వేగవంతం అయ్యే విధంగా ప్రయత్నం చేశారు. ఇప్పటి  వరకు  ఖమ్మం టూ సూర్యపేట జాతీయ రహదారి నిర్మాణ పనులు 75 శాతం పూర్తి కాగా, అక్కడక్కడ నిర్మాణ పనులు మిగిలిపోయాయి. అలాగే ఖమ్మం టూ కోదాడ నిర్మాణ పనులు కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఖమ్మం టూ కురవి నిర్మాణ పనులకు భూసేకరణ జరుగుతుండగా, ఖమ్మం టూ దేవరపల్లి రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తైయ్యింది. పనులు ప్రారంభించడమే తరువాయి.

== వచ్చే నెలలో ఖమ్మం టూ సూర్యపేట రోడ్డు ప్రారంభం

ఖమ్మం టూ సూర్యపేట జాతీయ రహధారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తైయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద  ప్రస్తుత రహదారిపై వంతెన నిర్మాణ పనులు మాత్రమే నిలిచిపోయాయి. మిగిలిన పనులన్ని పూర్తి అయినట్లు నేషనల్ హైవే అథారటి అధికారులు చెబుతున్నారు. సుమారు 75నుంచి 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ రహదారిని వచ్చే నెల రెండవ వారంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి చేతుల మీదగా జాతీయ రహదారిని ప్రారంభించే అవకాశం ఉంది. అందుకు గాను అధికారులు ఇప్పటి నుంచే ట్రైయిల్ రన్ వేస్తున్నారు. ఇప్పటికే సూర్యపేట నుంచి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వరకు నేషనల్ హైవే పై వాహనాల రాకపోకలకు అనుమతినిచ్చారు. బుధవారం రాత్రి నుంచి నేషనల్ హైవే పై వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి.

== 20ఏళ్ల కల నేరవేరనుందా..?

హైదరాబాద్ నుంచి చత్తీషఘడ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వయా ఖమ్మం జిల్లా అయ్యింది.. ఏ వాహనాలు అయిన ఖమ్మం మీదగా ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే అలాంటి ఖమ్మంలో నేషనల్ హైవే లేదు. దీంతో గడిచిన 20ఏళ్ల నుంచి నేషనల్ హైవే కావాలని ఎందరో నాయకులు, ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు కోరుకున్నారు. ఇదిగో..అదిగో అంటూ గత ప్రభుత్వాలు ఊరించాయి.. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవే ఖమ్మంకు అవకాశం రాలేదు..

allso read- ఖమ్మం జిల్లాలో మరో సూది హత్య

ఏపీకి అవకాశం వచ్చినప్పుడళ్లా  రాయలసీమ, కోస్తాఆంధ్రకు నేషనల్ హైవేలను తీసుకెళ్లారే తప్ప తెలంగాణలోని ఖమ్మంకు అవకాశం ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువదలని విక్రమార్కుడిగా జాతీయ రహదారిని మంజూరు చేయించి, పనులను ప్రారంభించే వరకు వదల్లేదు. అయితే ప్రస్తుతం ఆ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో ఖమ్మం జిల్లా ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 20ఏళ్ళ కల నేరవేరనుందని సంబుర పడుతున్నారు. ఇక మిగిలిన రహదారులు కూడా నిర్మాణం పూర్తై ప్రారంభమైయితే ఖమ్మం జిల్లా రూపురేఖలే మారిపోతాయని అనుకుంటున్నారు. చూద్దాం జాతీయ రహదారి పనులు ఏప్పడు పూర్తి అవుతాయో..?

== సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ 

జిల్లాలో రహదారుల విస్తరణ పనుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రహదారుల విస్తరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 200 కి.మీ. మేర నేషనల్ హైవే లచే రహదారి విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్, ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్, సూర్యాపేట నుండి ఖమ్మం, కోదాడ నుండి ఖమ్మం, ఖమ్మం నుండి కురవి వరకు రహదారుల విస్తరణ పనులు ఉన్నట్లు ఆయన అన్నారు.

allso read- ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు టోకరా

ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు, పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం రహదారి విస్తరణ పనులు పూర్తయినట్లు, త్వరలో రవాణాకు అనుమతించనున్నట్లు తెలిపారు. కోదాడ నుండి ఖమ్మం వరకు రహదారి విస్తరణ భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఖమ్మం నుండి కురవి రహదారి భూసేకరణ నోటిఫికేషన్ స్థాయిలో ఉన్నట్లు, ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఖమ్మం నుండి తల్లాడ రహదారిని నాలుగు వరసల రహదారిగా విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. రహదారులు విస్తరణతో ప్రజలకు సౌకర్యం తో పాటు, ప్రమాదాల నియంత్రణ జరుగుతుందని, అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాంతీయ అధికారి, హైదరాబాద్ కృష్ణ ప్రసాద్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.