బండి సంజయ్ కి పిచ్చిలేసి గేంతుతున్నడు: తాతామధు
== కేసీఆర్ ను ఎదుర్కోలేకనే బీజేపీ నడిమిట్ల దరువేస్తోంది
== ఢిల్లీ నుంచి గల్లీ నాయకులు సిగ్గు వదిలేసి తిరుగుతున్నారు
== బీజేపీని ఎదిరిస్తే సీబీఐ,ఈడీలతో దాడులు
== తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసుపై చట్టం తనపనితాను చేస్తోంది
== కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాము
== క్రిష్ణయ్య హత్యకు మునుగోడు ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా..?
== విలేకర్ల సమావేశంలో కేంద్రప్రభుత్వంపై మండిపడిన ఎమ్మెల్సీ తాతామధుసూదన్
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 24(విజయంన్యూస్)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పిచ్చిలేచినట్లు ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఏం అంశంపై కోట్లాడాలో తెలియక, సమస్యలు లేకపోవడం వల్ల మతిబ్రమించి పిచ్చిలేసి రోడ్లపైకి వచ్చి ఎగురుతున్నడని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతామధుసూదన్ దుయ్యబట్టారు. బుధవారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తాతామధుసూదన్ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న ధానాలతో దేశంలో అనిశ్చితి ఏర్పడుతుందని తాత మధు అన్నారు.. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుందని, ఎవరైనా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎదురు తిరిగి మాట్లాడితే సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి బ్లాక్ మెయిల్ కు తెరలేపుతున్నారని ఆరోపించారు.
ఇది కడా చదవండి: ఎమ్మెల్యే పీఏలా..? ప్రభుత్వాధికారులా..?
ఏ రాష్ట్రంలో చూసిన ఇదే సమస్య ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివద్దికి మతిబ్రమించిన బీజేపీకి ఎక్కడ సమస్యలు దొరకడం లేదని, దీంతో వాళ్లు పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న నాయకులు సిగ్గు వదిలేసి తెలంగాణ రోడ్లపై తిరుగుతున్నారన్నారని యద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఏదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారని, అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ కేసుకు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉన్నట్లు పిచ్చికూతలు కూస్తున్నారని ఆరోపించారు. కవిత నిజంగా తప్పు చేస్తే కేంద్రం తన చేతిలోనే ఉన్న ఈడీ, సీబీఐ అధికారులతో ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోయారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులు పర్యటన చేసిన తరువాత జనమంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారనే సమాచారం తెలుసుకున్న బండిసంజయ్, ఏం చేయాలో తెలియకా పిచ్చి లేసి రోడ్ల మీద తిరుగుతున్నాడన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక రూపాయి మారకం విలువ పడిపోయిందన్నారు.. బీజేపీ ని ఏదిరించిన వారిపై సీబీఐ , ఈడీలతో దాడులు చెపిస్తూ0దని బీజేపీ పాలిత రాష్ట్రాలలో సీబీఐ ఈడీ దాడులు జరుగుతున్నాయని అన్నారు..బీజేపీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని తాము ఎదురు తిరిగితే బీజేపీ తట్టుకోలేదన్నారు.. బీజేపీ విధానాలను ముక్తకంఠం తో ఖండించాలన్నారు.. అలాగే ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని క్రిష్ణయ్యపై హత్య జరగడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కచ్చితంగా నింధితులకు శిక్ష పడటం ఖాయమన్నారు. ఎవర్ని వదలోద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. మునుగోడుకు, తమ్మినేని క్రిష్ణయ్య హత్యకు సంబంధం ఉందని చాలా పత్రికల్లో, టీవీల్లో చూశానని అన్నారు.
ఇది కూడ చదవండి: మాకోద్దు ఈ అన్నం అంటూ విద్యార్థుల ఆందోళన
క్రిష్ణయ్య హత్యకు, మునుగోడు ఎన్నికలకు ఏం సంబంధం ఉందో అర్థం కావడం లేదన్నారు. తమ్మినేని క్రిష్ణయ్య టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన హత్య చేసిన మరుక్షణమే తమకు తెలిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. హత్య జరిగిన తరువాత నేను, మాజీ మంత్రి తుమ్మల కలిసి ప్రభుత్వాసుపత్రిలోని మార్చురి వద్దకు వెళ్లి చూశామని, ప్రతి రోజు వాళ్ల ఇంటికి వెళ్లి కుటంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెబుతున్నమని తెలిపారు. తమ్మినేని హత్య చాలా ప్రణాళిక బద్దంగా జరిగిందని, ఆ హత్యకు మునుగోడు కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ బాలసానిలక్ష్మినారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యరు.