Telugu News

దారి చూపని ధరణి.. మాకేందుకు అంటున్నజనం

చింతగుర్తి రచ్చబండలో మహ్మద్  జావేద్

0

దారి చూపని ధరణి

== భూ సమస్యలతో రైతులు గగ్గోలు

== కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజల్లో భయం

== ప్రశ్నిస్తే వేధింపులు.. అక్రమకేసులు బనాయింపు

== చింతగుర్తి రచ్చబండలో మహ్మద్  జావేద్

ఖమ్మం, జులై 20(విజయంన్యూస్)

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఘోరంగా విఫలం చెందిందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపించారు. బుధవారం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమంలో రైతులు భూ సమస్యలపై తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్ తన బినామీలకు భూములను అప్పనంగా అంటగట్టేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పాలు చేశాడని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి నేడు పెరిగిన ధరలకు కారణం అయిందని అన్నారు.

ALLSO READ- భద్రాద్రిని కాపాడిందేవరు..?

జీఎస్టీ పేరిట కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో కెసిఆర్ కూ వాటా ఉందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తప్పుడు అయితే నాడు జిఎస్టి బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్నపిల్లలు తాగే పాలనూ వదలకుండా దోపిడీకి దిగజారిందని మండిపడ్డారు. ఇలాంటి దోపిడీలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో వేధించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అక్టోబర్లో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ  పాదయాత్ర మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి భయం పట్టుకొని ఈడీ పేరిట వేధింపులకు ఒడిగట్టిందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసిన, ఎన్ని అడ్డంకులు సృష్టించిన, కాంగ్రెస్ అధిష్టానం కచ్చితంగా ప్రజల్లోకి వస్తుందని ప్రజా సమస్యలపై పోరాడుతుందని, ప్రజలకు అండగా నిలబడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు సంఘర్షణ సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలుపరుస్తామని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు వల్ల ప్రజల్లో భయానిక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలకు కాలం చెల్లె రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. అనంతరం చింతగుర్తిలో ప్రతి రైతుకు రైతు డిక్లరేషన్ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం మండలం నాయకులు దిరిశాల చిన్న వెంకటేశ్వరరావు, కుంటముక్కల నాగేశ్వరావు, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, దిద్దుకూరు వెంకటేశ్వరరావు, పల్లెబోయిన చంద్రం, నల్లమల సత్యం బాబు, కిసాన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, కోటపాడు  బాతుల సుధాకర్, అదేవిధంగా గ్రామ నాయకులు సల్మాన్ భాషా, షారుక్ ఖాన్, వెంకన్న, పాలసీమ సూరయ్య, పార్వతి, వెంకన్న, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ALLSO READ- డ్రైనేజీల నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటేనా….?