ప్రమాదవశాత్తు ఇనుప ఊసల చిక్కుకున్న బాలిక
కాంట్రాక్టర్ చేతులు దులుపుకొని నిద్రపోతున్న వైనం
(ఆళ్లపల్లి విజయం న్యూస్):-
మండల పరిధిలోని రాఘవాపురం పంచాయతీ కర్ణే గూడెం చంద్రాపురం మార్గమధ్యలో కట్టిన కల్వర్టు సగం పనులు చేసి పని పూర్తి కాకపోయినా చేతులు దులుపుకొని పోయిన కాంట్రాక్టర్ కల్వర్టు ఏఈ కి సర్పంచ్ కి పలుమార్లు అధికారులుకు పిరియదుచేసినపట్టించుకోలేదు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడంలేదు చంద్ర పురం నుంచి స్కూల్ కు వస్తున్న విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది మూడు సంవత్సరాలు గడుస్తున్నాసైడ్ వాల్స్ కట్టక పోవడం వలన రాడ్ బెండింగ్ చువ్వలు ప్రమాదాలకు నిలయంగా మారడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
also read;-బుగ్గవాగు వద్ద పులి సంచారం
స్కూలుకు వెళ్లి వస్తున్న క్రమంలో లో ఒక బాలిక ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ఇనప ఊసులకు చిక్కుకుపోయిన ప్రమాదం జరిగింది ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటన ఒక జరిగింది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆ యొక్క కల్వర్టు పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు