Telugu News

కూసుమంచిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏఓ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిక

0

కూసుమంచిలో విత్తన దుస్తులను తనిఖీ చేసిన ఏఓ

== నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిక

(కూసుమంచి -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

కూసుమంచి ,పాలు కూసుమంచి , కోక్యాతండ , చౌటపల్లి మొదలగు గ్రామాలలోని విత్తన పంటలను కూసుమంచి మండల వ్యవసాయ అధికారిని రామడుగు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తన వ్యాపారులందరూ చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. రైతులకు ఇచ్చే బిల్లు మీద వారి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, లాట్ నెంబర్లను సరి చూడాలని, రైతు వారిగా విత్తన విక్రయాలను రిజిస్టర్‌లో పొందుపరచాలని, ఇటువంటి రిజిస్టర్లను ప్రతిరోజు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు విత్తనాలు అమ్మిన రిపోర్టును సమర్పించాలని, రిజిస్టర్లను అప్డేట్ చేయడం, స్టాక్ బోర్డు మరియు ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఏ డీలర్ అయినా ఎంఆర్ పి కన్నా అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం వస్తే విత్తన చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.