అర్చన శర్మ ఆత్మకు శాంతి చేకూరాలి
== ఖమ్మం ఐఎంఎ ఆద్వర్యంలో ర్యాలీ
== డాక్టర్ మృతికి కారకుల పై చర్యలు తీసుకోవాలి.
== రోగులకు వైద్యమందించే డాక్టర్స్ పై ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం..
(ఖమ్మం-విజయంన్యూస్);-
రాజస్థాన్ లో ఒక గర్భిణికి చికిత్స అందిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ అర్చన శర్మ పై అక్కడి పోలీసులు మర్డర్ కేసు నమోదు చేయడం శోచనీయమని, డాక్టర్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఐఎంఎ అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ భాగం కిషన్ రావు, డాక్టర్ సురేష్ లు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఖమ్మం ఐఎంఎ భవనం నుంచి జడ్పి సెంటర్ వరకు డాక్టర్స్ తో కలసి ర్యాలి నిర్వహించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
also read:-సీఆర్పీల సమస్యలు పరిష్కరించండి…
వైద్యులు వైద్య వృత్తిలో అనేక జాగ్రత్తలు పాటిస్తూనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, కొన్ని సందర్భాలలో పేషoట్ సర్జరీ జరిగే సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశముoడి ప్రాణాలు కోల్పోయే పరిస్తితి వుంటుందని, అలా జరిగుగినపుడు సదరు డాక్టర్ పై మర్డర్ కేసు ఎలా నమోదు చేస్తారని వారు ప్రశ్నించి రాజస్థాన్ పోలిసుల తీరును తప్పుబట్టారు..
also read :-ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు…ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ , డాక్టర్ బీఎస్ఆర్, డాక్టర్ బొడిపూడి అజయ్ కుమార్, డాక్టర్ శైలజ, డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ, , డాక్టర్ కంభంపాటి నారాయణరావు, ఆదిశంకరరావు, డాక్టర్ కొల్లి రమా, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ పీఎన్ఎస్వీ ప్రసాద్, డాక్టర్ సతీష్ బాబు, డాక్టర్ రోజాకిరన్ తదితరులు పాల్గొన్నారు….