Telugu News

=ఖమ్మంలో కండక్టర్ గౌస్ పాషా వినూత్న ప్రచారం

ఆర్టీసీ బస్సులో ప్రయాణించండంటూ విన్నూత్న ప్రచారం

0

===ఖమ్మంలో కండక్టర్ గౌస్ పాషా వినూత్న ప్రచారం
== ఆర్టీసీ బస్సులో ప్రయాణించండంటూ విన్నూత్న ప్రచారం
== అభినందనలు తెలుపుతున్న ఆర్టీసీ యజమాన్యం, ప్రయాణికులు

***(విజయం న్యూస్);-
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేద్దాం.. ప్రగతి రథ చక్రానికి తోడ్పాటునిద్దాం.. సురక్షితంగా ఇంటికి చేరుదాం అంటూ ఓ ఆర్టీసీ కండాక్టర్ తన మోటర్ సైకిల్ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నాడు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో నేను సైతం అంటూ ఖమ్మం డిపో కండక్టర్ మహమ్మద్ గౌస్ పాషా వినూత్న ప్రచారం నిర్వహిస్తు అందర్ని అకట్టుకుంటున్నారు. పాషా తన ద్విచక్ర వాహనానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకతను తెలిపే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిద్దాం, ప్రగతి రథ చక్రానికి తోడ్పాటునిద్దాం,మన ఊరు మన బస్సులను ఆదరిద్దాం, వివాహాది శుభకార్యములకు మరియు తీర్థయాత్రలకు ఆర్టీసి బస్సుల్ని బుక్ చేసుకుందాం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం,సుఖవంతం, శుభప్రదం అంటూ ప్రచార బోర్డును తయారు చేయించి తన వాహనానికి వెనక ముందు కట్టుకుని ప్రచారం చేయటం పలువురిని ఆలోచింపజేస్తున్నది.

also read :-శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం..

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే మంచి మనసున్న మహమ్మద్ గౌస్ పాషా సామాజిక సేవలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.గతంలో రోడ్ల పై చిన్న చిన్న గుంటలు పడి ద్విచక్ర వాహనాల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతున్న నేపద్యంలో తన ద్విచక్ర వాహనంపై రాళ్ళు,మట్టి తీసుకొచ్చి గుంటలు పూడ్చడం ద్వారా అనేక మంది ప్రశంసలు పొందారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామిగా అనేక మొక్కలు నాటి వాటిని నిరంతరం పర్యవేక్షించి సంరక్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామాత్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి నుంచి ప్రశంసాపత్రాన్ని సైతం అందుకున్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే విధంగా ప్రయాణికులను ఆలోచింపజేసే వినూత్న ప్రచారం చేస్తున్న మహమ్మద్ గౌస్ పాషా కృషిని ఆర్టీసీ ఉద్యోగులు అందరూ అభినందిస్తున్నారు.