ఇంటిముందు ధర్నా చేసిన యువతి ఆత్మహత్యహత్నం
(కూసుమంచి-విజయం న్యూస్);-
ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం కోదాడ అడ్డ రోడ్డు సమీపంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంచర్ల మండలం చందుమల్ల గ్రామానికి చెందిన యువతి, ఖమ్మం గ్రామీణ మండలం కోదాడ అడ్డ రోడ్డు ప్రాంతానికి చెందిన గునిగంటి పవన్ కృష్ణ ప్రేమించుకున్నారు. పవన్ కృష్ణ తనను మోసం చేసాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు గత రెండు రోజులుగా ధర్నా చేస్తూ ఉంది. అయినప్పటికి ఎవరు పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది .
also read :-కూసుమంచిలో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజువేడుకలు
వెంటనే స్థానికులు ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన సంఘటనను గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న హాస్పటల్ సూపర్నెంట్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు, ఆమె ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని తెలిపారు. అయితే ఈ విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారో..?