బస్సు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి దుర్మరణం
(ఖమ్మం విజయం న్యూస్ ):-
ఖమ్మం జిల్లాలో కూసుమంచి నుంచి ఖమ్మం వెళుతున్న ఆటోను జీళ్లచెరువు వద్ద సూర్యాపేట కు చెందిన పల్లెవెలుగు బస్సు ఢీకొన్న ప్రమాదం లో గంగబండ తండా కు చెందిన వడిత్య లాలు (40) శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో మృతి చెందాడు. గురువారం జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఒడిత్య లాలూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలకు బలమైన గాయలవడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వఆసుపత్రికి, అక్కడి నుంచి మమత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.